Gautam Adani Bribery Case: అదానీ కేసుపై ఎంపీ రఘునందన్ రియాక్షన్.. వాళ్లతో లావాదేవీలు అంటూ..
ABN, Publish Date - Nov 22 , 2024 | 08:50 PM
Gautam Adani Bribery Case: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
హైదరాబాద్: ప్రముఖ బిలియనీర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కేసు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆయన మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇప్పుడంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మన దేశ రాజకీయాలతో పాటు స్టాక్ మార్కెట్‌ను కూడా ఈ వార్త కుదిపేసింది. అలాంటి అదానీ కేసుపై జహీరాబాద్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుతో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
అక్రమ లావాదేవీలు వాళ్లవే..
‘అమెరికాలోని అదాని కేసుతో బీజేపీకి సంబంధం లేదు. యూఎస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించిన నాలుగు రాష్ట్రాలను బీజేపీ పాలించిందా? రాహుల్ గాంధీ తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఆ కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయంలో తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, ఒడిశాలో బీయూ జనతాదళ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీలు పవర్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదానీతో అక్రమ లావాదేవీలు చేశారు. రాహుల్ వ్యతిరేకిస్తున్న అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారు. అబద్ధాల పునాదులపై నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలవలేదు’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
మళ్లీ మోడీనే వస్తారు
అదానీ కేసు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ను దేశ ప్రజలు మూడుసార్లు తిరస్కరించారని రఘునందన్ రావు అన్నారు. రాహుల్ గాంధీ ఇలాగే వ్యవహరిస్తే నాలుగోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెడతామని బీజేపీ ఎంపీ క్లారిటీ ఇచ్చారు. కాగా, అదానీ గ్రూప్ వ్యవహారంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ రియాక్ట్ అయింది. ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని దాటగలవని విశ్వాసం వ్యక్తం చేసింది. ఎప్పటిలాగే భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. ఇరు దేశాల బంధం బలమైన పునాదులపై నిలబడిందని వైట్‌హౌస్ మీడియా సెక్రెటరీ కరీన్ జిన్ పియర్ పేర్కొన్నారు.
Also Read:
రాహుల్, రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్..
హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతోంది.. క్షణక్షణం ఉత్కంఠ..
చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం
For More Telangana And Telugu News
Updated Date - Nov 22 , 2024 | 08:57 PM