ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amrapali: హైకోర్టునే తేల్చనివ్వండి..

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:59 AM

నందగిరి హిల్స్‌లో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి విచారణ చేపట్టారు.

  • నందగిరి హిల్స్‌లో అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి వ్యాఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నందగిరి హిల్స్‌లో నెట్‌ నెట్‌ వెంచర్స్‌ అక్రమంగా చేపట్టిన నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి విచారణ చేపట్టారు. కమిషనర్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన విచారణలో ఈ విషయాన్ని హైకోర్టునే తేల్చనిద్దామని ఆమె వ్యాఖ్యానించారు. ‘అక్రమ హర్మ్యం’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. నెట్‌ నెట్‌ వెంచర్స్‌ సంస్థ.. నందగిరి హిల్స్‌లో 865.42 గజాల జూబ్లీహిల్స్‌ సొసైటీ స్థలాన్ని కొనుగోలు చేసింది.


జూబ్లీహిల్స్‌ సొసైటీ భూమిని సాకుగా చూపుతూ ఏకంగా 20 అంతస్థులకు అనుమతి తెచ్చుకొని 2,09,000 చదరపు అడుగుల కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. దీనిపై ఫిర్యాదు లు వెళ్లడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. విచారించిన అధికారులు.. జీహెచ్‌ఎంసీ అధికారులపై చర్య తీసుకోవాలని, బిల్డర్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలని సిఫారసు చేశారు. ఈ నివేదికను అమలు చేయాలంటూ నందగిరి హిల్స్‌ సొసైటీ హైకోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌వద్ద వాదనలు జరగ్గా.. ఈ విషయాన్ని హైకోర్టునే తేల్చనిద్దామని ఆమ్రపాలి అన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 04:59 AM

Advertising
Advertising