ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Employees: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి...

ABN, Publish Date - Dec 30 , 2024 | 05:04 AM

జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్‌లొకేటెడ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్‌కుమార్‌, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు.

  • తిరిగి సొంత జిల్లాలకు పంపాలి

  • ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జేఏసీ డిమాండ్‌

కవాడిగూడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జీవో 317తో జిల్లాలు మారిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలని జీవో 317 డిస్‌లొకేటెడ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ టీచర్స్‌ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడకంటి అజయ్‌కుమార్‌, ఎలగొండ రత్నమాల ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్ష హోదాలో తమ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు.


జీవో 317 ద్వారా స్థానచలనం చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద సత్వర న్యాయ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 05:04 AM