ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari Floods: జలదిగ్బంధంలో భద్రాద్రి ఏజెన్సీ

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:22 AM

గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో ఆర్డీవో దామోదర్‌రావు మూడో(తుది) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

  • 34 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

  • 53.4 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవాహం

  • శ్రీశైలానికి 4.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో

  • రెండు రోజుల్లో నిండనున్న జలాశయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో ఆర్డీవో దామోదర్‌రావు మూడో(తుది) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆరు గంటలకు గోదావరి నీటి మట్టం 53.4 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 34 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం-వాజేడు, భద్రాచలం-కూనవరం, భద్రాచలం-చర్ల మార్గంలో పలు ప్రాంతాల్లో రహదారులపై గోదావరి వరద ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని అశోక నగర్‌ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు నీట మునిగాయి. మొత్తం 94 కుటుంబాలకు చెందిన 306 మందిని పునరావాస కేంద్రాలకు చేర్చారు.


భద్రాద్రి సరిహద్దున ఉన్న ఏపీలోని ఎటపాక పెద్దవాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఆ నీరు ఈ కాలనీల్లోకి వచ్చింది. రెండు రోజులుగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గోదావరి వరద రోడ్లపైకి చేరడంతో భద్రాచలం, వెంకటాపురం, చర్ల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, గోదావరి నీటిమట్టం 75 అడుగులకు చేరినా.. భద్రాచలంలోకి చుక్క నీరు రానివ్వకుండా చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. నూతనంగా చేపట్టిన 700 మీటర్ల కరకట్ట నిర్మాణాన్ని వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శనివారం భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను, నూతనంగా నిర్మిస్తున్న కరకట్టను ఆయన పరిశీలించారు.


  • పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ మండలాల్లో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్‌, ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటించి డీఆర్‌ఎస్‌ బృందాలను సిద్ధం చేశారు. జిల్లాలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వెంకటాపురంలో6.3 సెం.మీ.. తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో 5సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ముసురు వాన పడుతోంది.


  • శ్రీశైలానికి భారీ వరద..

కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు రోజుల్లో నిండే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం జలాశయానికి 4.12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. జలవిద్యుత్‌ ఉత్పాదన చేసి 74,258 క్యూసెక్కులను వదిలిపెట్టారు. ప్రాజెక్టు సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 127.6 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


  • ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు పంపింగ్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మిడ్‌మానేరు జలాశయానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం ఉదయం నుంచి వరద పెరుగుతూ వచ్చి సాయంత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు నీటి మట్టం 17.3 టీఎంసీలకు చేరుకోవడంతో ఎల్లంపల్లి హెడ్‌ రెగ్యులేటరీ గేట్లు ఎత్తి.. నీటిని పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని నంది పంప్‌హౌ్‌సలోకి వదిలారు. మొదట ఒక మోటారును ఆన్‌ చేసిన అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగు మోటార్లు ఆన్‌ చేశారు. 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసి అక్కడి నుంచి టన్నెల్‌ ద్వారా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్‌హౌ్‌సకు తరలిస్తున్నారు. అక్కడ మోటార్లు ఆన్‌ చేసి మిడ్‌ మానేరుకు నీటిని పంపిస్తున్నారు. ఎల్లంపల్లికి 12,931 క్యూసెక్కుల వరద వస్తోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రస్తుత ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో

సామర్థ్యం నిల్వ

ఆల్మట్టి 129.72 77.05 238000 300000

నారాయణపూర్‌ 37.64 29.20 300000 300064

తుంగభద్ర 100.86 99.66 121456 158457

జూరాల 9.66 7.74 302000 316308

శ్రీశైలం 215.81 127.60 412280 74258

నాగార్జునసాగర్‌ 312.05 127.97 52559 6253

సింగూరు 29.91 14.16 2497 391

శ్రీరాంసాగర్‌ 80.5 31.26 30554 605

కడెం 7.6 6.14 5086 7120

ఎల్లంపల్లి 20.18 17.40 12931 13076

మేడిగడ్డ 16.17 6.07 539200 539200

సమ్మక్క 6.94 6.94 975910 975910

సీతమ్మ 36.57 0.2 1395637 1395637

Updated Date - Jul 28 , 2024 | 04:22 AM

Advertising
Advertising
<