ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Government Employee: బాలికపై కేంద్ర ప్రభుత్వోద్యోగి అత్యాచారం

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:58 AM

అభం శుభం తెలియని ఓ బాలిక (12)పై కామంతో కన్నుమూసుకుపోయిన ఓ ప్రభుత్వోద్యోగి (58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు లైంగిక దాడి చేశాడు.

  • నెల రోజులలో రెండుసార్లు ఘాతుకం

  • సైదాబాద్‌లో ఘటన.. అరెస్టు చేయని పోలీసులు

సైదాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అభం శుభం తెలియని ఓ బాలిక (12)పై కామంతో కన్నుమూసుకుపోయిన ఓ ప్రభుత్వోద్యోగి (58) అత్యాచారానికి ఒడిగట్టాడు. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు లైంగిక దాడి చేశాడు. సైదాబాద్‌లో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదటిసారి భయపడి తల్లిదండ్రులకు చెప్పని బాలిక ఈ నెల 11వ తేదీన చాక్లెట్లు కొనడానికి కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి పిలిచి రెండోసారి అతడు ఘాతుకానికి పాల్పడడంతో ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి విషయం తెలిపింది.


బాలిక తల్లి అదే రోజు సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. మొదట వారు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారని, చివరకు ఓ పోలీస్‌ అధికారి ఒత్తిడితో 13వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిసింది. నిందితుడు కేంద్ర రక్షణ రంగ సంస్థ ఉద్యోగి కావడంతో అతడిపై కేసు నమోదు కాకుండా పలు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది.


ఓ ఎస్సై స్వయంగా రంగంలోకి దిగి భాధిత బాలిక తల్లిదండ్రులతో రాజీకి ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. పోలీసులు కేసు వివరాలు గోప్యంగా ఉంచడం, నిందితుడిని అరెస్ట్‌ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Aug 19 , 2024 | 04:58 AM

Advertising
Advertising
<