ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dandigul: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు

ABN, Publish Date - Aug 29 , 2024 | 04:01 AM

చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.

  • ఎల్‌ఆర్‌ఐటీ, ఏరోనాటికల్‌ కాలేజీల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం

దుండిగల్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలనే ఆదేశించింది. ఈ మేరకు మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మర్రి లక్ష్మణ్‌ రెడ్డికి చెందిన ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలకు దుండిగల్‌ తహసీల్దార్‌ ఈ నెల 22నే నోటీసులు జారీ చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో ఈ కళాశాలలు ఉన్నాయి.


దుండిగల్‌లోని చినదామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని 8 ఎకరాల 24 గుంటల్లో కళాశాలల కోసం నిర్మాణాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో సర్వే నెంబర్‌ 489లో 1 ఎకరంలో భవనాలు నిర్మాణాలు , సర్వే నెంబరు 484, 485, 488లో రెండెకరాల్లో శాశ్వత షెడ్డులు, సర్వే నెంబరు 492, 489లోని మూడు ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌ కొనసాగిస్తున్నారని, అలాగే, ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీ రోడ్లు 2.24 ఎకరాల్లో ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా ఆయా నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందులో స్పష్టం చేశారు.


కాగా, నోటీసుల నేపథ్యంలో నిర్మాణాలను కూల్చివేయకుండా ఉండేందుకు కళాశాల యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది. గతంలో ఇదే కళాశాలపై కాంగ్రెస్‌ నాయకులు మైనంపల్లి హన్మంతరావు ఫిర్యాదు ఆధారంగా కళాశాలలో భవనాలను మాత్రం కూల్చివేశారు. ఈ కూల్చివేత జరుగుతుండగానే న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్న యాజమాన్యం కూల్చివేతను అడ్డుకుంది. ఇప్పుడు హైడ్రా రాకతో ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌టీ కళాశాలల మరోసారి వార్తల్లో నిలిచాయి.

Updated Date - Aug 29 , 2024 | 04:01 AM

Advertising
Advertising