ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..!!

ABN, Publish Date - Jun 07 , 2024 | 07:21 AM

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

mlc bypoll counting

హైదరాబాద్: వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.


ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేశ్ రెడ్డి తెలిపారు.


హాల్-4లో 539 ఓట్ల మెజార్టీతో తాను ఉన్నానని రాకేశ్ రెడ్డి వివరించారు. అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్నకు లీడ్ ఇచ్చారని వెల్లడించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మూడో రౌండ్‌లో తీన్మార్ మల్లన్న 3 వేల ఓట్ల లీడ్ సాధించారు. మూడు రౌండ్లు కలిపితే 17 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 07:22 AM

Advertising
Advertising