ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao : చంద్రబాబు శక్తిమంతుడు

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:29 AM

ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో.. గతంలో ఆ రాష్ట్రంలో కలిపిన తెలంగాణకు చెందిన ఏడు మండలాలను....

  • ఆయనపై కేంద్ర సర్కారు ఆధారపడి ఉంది

  • 7 మండలాలు, సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలి

  • రేవంత్‌కు హరీశ్‌రావు సూచన

  • ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ సూచన

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో.. గతంలో ఆ రాష్ట్రంలో కలిపిన తెలంగాణకు చెందిన ఏడు మండలాలను తిరిగి రాబట్టే అంశంపై పట్టుబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ‘ప్రస్తుతం చంద్రబాబుపైనే కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇవాళ ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఆయనపై ఒత్తిడి తెచ్చి ఏడు మండలాలు, లోయర్‌ సీలేరు పవర్‌ ప్రాజెక్టు తెలంగాణకు కేంద్రం ఇచ్చేలా కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలవరం కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు.

కాంగ్రెస్‌ పాలనతో అస్తవ్యస్తం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని హరీశ్‌ ఆరోపించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాల్సింది పోయి.. రోజువారీ చర్యలపైనా దృష్టి పెట్టడం లేదన్నారు.


9 ఏళ్ల తమ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు గ్రామపంచాయతీలకు 3,300 కోట్లు, మునిసిపాలిటీలకు రూ.1700 కోట్లు నిధులిచ్చామని.. కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వృద్ధులకు ప్రతినెలా రూ.4వేల పింఛన్‌ ఇస్తానన్న రేవంత్‌రెడ్డి ఆ హామీ నెరవేర్చకపోగా, అంతకుముందు ఇచ్చే రూ.2వేలు కూడా 2 నెలల నుంచి ఇవ్వడం లేదన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాగానే ఆ రాష్ట్రంలోని వృద్ధులకు పాతబకాయిలు కలిపి రూ.7వేలు ఇచ్చారని హరీశ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ప్రభాకర్‌ అనే రైతు వీడియో విడుదల చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నారని, ఆ వీడియోనే.. మరణ వాంగ్మూలంగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. ప్రభాకర్‌ కుటుంబానికి 25లక్షలు పరిహారం, వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 03 , 2024 | 04:29 AM

Advertising
Advertising