ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: హరీశ్‌రావు
ABN, Publish Date - Sep 01 , 2024 | 04:57 AM
ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మొద్ద నిద్ర వీడి విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకుల కస్తూర్బాగాంధీ పాఠశాలను సబితారెడ్డితో కలిసి శనివారం ఆయన సందర్శించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆ పాఠశాల విద్యార్థులు శుక్రవారం రహదారిపై ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో తమ పాఠశాలకు వచ్చిన మాజీ మంత్రుల వద్ద విద్యార్థినులు తమ సమస్యలు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన హరీశ్ రావు.. పాల్మాకుల పాఠశాల విద్యార్థినుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పాల్మాకుల పాఠశాల ఉపాధ్యాయులను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Sep 01 , 2024 | 04:57 AM