TG News: కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు
ABN, Publish Date - Mar 15 , 2024 | 09:51 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్‌కు నిరసనగా రేపు అన్ని నియోజక వర్గాలల్లో ఆందోళనలకు ఆ పార్టీ పిలుపును ఇచ్చింది. కవితనుఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్‌కు నిరసనగా రేపు అన్ని నియోజక వర్గాలల్లో ఆందోళనలకు ఆ పార్టీ పిలుపును ఇచ్చింది. కవితనుఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. కవిత అరెస్ట్ అప్రజాస్వామికమని, అక్రమం అనైతికమని అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ దురుద్దేశంతో కుట్రతో బీజేపీ కవితని అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఏడాదిన్నరగా కవితను అరెస్ట్ చేస్తామని ప్రకటనలు చేశారన్నారు. రేపు(శనివారం) ఎన్నికల షెడ్యూల్ వస్తుందని.. ఈ రోజు కవితని అరెస్ట్ చేయడమంటే మాజీ సీఎం కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికేనని చెప్పారు.
అరెస్ట్‌లు తమకు కొత్త కాదని.. దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టుకు చెప్పిన దానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 19వ తేదీన కోర్టులో విచారణ ఉందని.. అరెస్ట్‌కు ఈరోజు అంత తొందర ఏం వచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బతీయడానికి అరెస్ట్ చేశారని అన్నారు. ముందు సెర్చ్ అన్నారని.. ఆ తర్వాత అరెస్ట్ ఎందుకు చేశారని ప్రశ్నించారు. ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసి ప్లాన్ ప్రకారం వచ్చారన్నారు. కవిత అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా ఉద్యమిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 15 , 2024 | 10:49 PM