ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:53 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై మంత్రులు చేసిన కామెంట్లపై హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌పై మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే మంత్రులు ఆయనను తిడుతున్నారని ధ్వజమెత్తారు.


Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకోమని చెబుతారు.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్‌లో చేరికలపై దృష్టి పెడతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ 5 ఏళ్ల త్వరాత మళ్లీ అధికారంలోకి రాదని చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఏం చేస్తారో చేయండి.. కానీ 5 ఏళ్ల తర్వాత ఆ పార్టీ నేతలకు తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ నేతలను వదలి పెట్టేది లేదని హరీష్‌రావు హెచ్చరించారు.


కాంగ్రెస్ హామీలను ప్రజలు మెదట నమ్మలేదని.. ఆ తర్వాత బాండ్ పేపర్లు రాసి ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలన్నారు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత కల్పిస్తామని మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తారు. రూ.2 లక్షల రుణమాఫీ అయిన వారు కాంగ్రెస్‌కి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని.. కానీ వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని చెప్పారు.


Errabelli Dayakar Rao: ఊహాగానాలకు చెక్.. మళ్లీ మార్చేస్తామంటూ ఎర్రబెల్లి సంచలనం..

రైతులకు ఇచ్చిన హామీలన్నీ మోసమేనని చెప్పారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీరు పెట్టించిందని మండిపడ్డారు. కొత్త పథకాలు ఇవ్వడం కాదు కదా.. ఉన్న పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం బంద్ చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ ప్రధానిని బడే బాయ్ అని అంటున్నాడన్నారు. తెలంగాణను గుజరాత్ మోడల్ చేయాలని రేవంత్ ప్రధానిని కోరాడని చెప్పారు. గుజరాత్‌ను తెలంగాణకు మోడల్‌గా చేసి సీఎం రేవంత్ గోద్రా అల్లర్లు సృష్టించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఉసురు పోసుకుంటుదని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 04:14 PM

Advertising
Advertising