ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health crisis: అడవిలో కంటైనర్‌ ఆస్పత్రి..

ABN, Publish Date - Jul 14 , 2024 | 02:59 AM

కడుపు నొప్పి వచ్చినా.. పురుటి నొప్పులు మొదలైనా.. అక్కడివారి బాధలు అరణ్య రోదనే..! విష సర్పం కాటువేసినా.. విష జర్వం బారినపడినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే..!

  • ములుగు జిల్లా పోచాపూర్‌లో ఏర్పాటు

  • రాష్ట్రంలోనే తొలి.. మంత్రి సీతక్క చొరవ

  • వ్యాధుల సీజన్‌లో అడవి బిడ్డలకు అండ

ములుగు, జూలై 13: కడుపు నొప్పి వచ్చినా.. పురుటి నొప్పులు మొదలైనా.. అక్కడివారి బాధలు అరణ్య రోదనే..! విష సర్పం కాటువేసినా.. విష జర్వం బారినపడినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే..! వైద్యం మాట దేవుడెరుగు.. మందు బిళ్లలూ అందనంత దైన్యం..! దట్టమైన అడవిలో.. విసిరేసినట్లుండే ఆ ఆదివాసీలకు ఆధునిక ప్రపంచమే కాదు.. ఆధునిక చికిత్సలూ దూరమే..! జోరు వానలో.. ఉప్పొంగే వాగులో నిండు గర్భిణులను, ఆరోగ్య విషమించిన వారిని తరలించిన ఉదంతాలెన్నో..! ఇలా ఇన్నాళ్లూ, రోగమొస్తే దేవుడి మీద భారం వేస్తున్న వీరికి.. ఇకపై మాత్రం కళ్లెదుటే ‘కంటైనర్‌ ఆస్పత్రిలో’ వైద్యుడు కనిపించనున్నాడు..! ములుగు జిల్లా తాడ్వాయి మండలం బందాల పంచాయతీ పరిధిలోని బొల్లెపల్లి, అల్లిగూడెం, నర్సాపూర్‌, పోచాపూర్‌లు పూర్తి ఆదివాసీ గ్రామాలు. ఒక్కోటి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.


600 పైగా గడపలు, వెయ్యిలోపు జనాభా ఉన్నారు. ప్రజలంతా వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తున్నారు. ఈ గూడేలకు ఎడ్ల బండి లేదా ద్విచక్ర వాహనాలపై మాత్రమే వెళ్లగలం. కార్లు అయితే అతికష్టమ్మీద వెళ్తాయి. వర్షాకాలంలో దారంతా బురదమయమై, మధ్యమధ్యలో వాగులు, ఒర్రెలు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ సమయంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ ప్రబలితే 12 కిలోమీటర్ల దూరంలోని కొడిశాల పీహెచ్‌సీనే దిక్కు. కానీ, వాగుల ఉధృతిలో కాలు బయటపెట్టేందుకు అవకాశమే ఉండదు. దీంతో ఏటా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క చొరవ చూపి పోచాపూర్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా కంటైనర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. శనివారం దీనిని సీతక్క.. జిల్లా కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీశ్‌, డీఎంహెచ్‌వో అప్పయ్యతో కలిసి ప్రారంభించారు.


వైద్యుడు, మందులు అందుబాటు

కలెక్టర్‌ పర్యవేక్షణలో రూ.7 లక్షల వ్యయంతో కంటైనర్‌ ఆస్పత్రిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇందులో నాలుగు పడకలు, అనుబంధంగా మరుగుదొడ్డి ఉంటాయి. ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఆశా కార్యకర్తలను నియమించారు. కొడిశాల పీహెచ్‌సీ వైద్యాధికారికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. భారీ వర్షాలు, వరదలతో వైద్యుడు వెళ్లలేని పరిస్థితుల్లో.. ఆదివాసీలకు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కావాల్సిన ఔషధాలను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు నిండు గర్భిణులను గుర్తించి ముందస్తుగా పీహెచ్‌సీకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. సాధారణ ప్రసవాన్ని చేసేలా సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. కాగా, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేట మండలాల్లో కూడా పలు మారుమూల గిరిజన గూడేలున్నాయి. వాటిలోనూ కంటైనర్‌ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 14 , 2024 | 08:23 AM

Advertising
Advertising
<