ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Assembly: 3 హత్య కేసుల్లో నిందితుడు

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:41 AM

అసెంబ్లీలో విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మధ్య మాటల మంటలు రేగాయి. ఇరువురూ పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు.

  • పెట్రోల్‌ బంకులో దొంగతనం కేసులోనూ.. జిల్లా నుంచి ఏడాదిపాటు బహిష్కరించారు

  • జగదీశ్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు

  • రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

  • లేదంటే మంత్రి, సీఎం రాజీనామా చేయాలి

  • వెంకట్‌రెడ్డికి ఎమ్యెల్యే జగదీశ్‌రెడ్డి సవాల్‌

  • చెత్తగాళ్లు.. చెత్త మాటలంటూ ఫైర్‌

  • సవాల్‌కు సిద్ధం.. నిరూపిస్తా: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మధ్య మాటల మంటలు రేగాయి. ఇరువురూ పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఆరోపణల్ని నిరూపించకపోతే పదవులకు రాజీనామా చేయాలంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకునేదాకా వెళ్లింది. దీంతో సోమవారం శాసనసభలో చర్చ వాడివేడిగా జరిగింది. జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ‘‘ఈయన తన గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ2. భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఈయన, ఈయన తండ్రి ఏ6, ఏ7. రామిరెడ్డి హత్య కేసులో ఏ3. మా జిల్లా నుంచి ఈయనను ఏడాదిపాటు బహిష్కరించారు.


అంతేకాదు.. మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌కు చెందిన పెట్రోల్‌ బంకులో దొంగతనం కేసులో ముద్దాయి. వీటితోపాటు ఎన్టీరామారావు హయాంలో మద్యనిషేధం విధించిన సమయంలో కర్ణాటక నుంచి మద్యం తెచ్చి అమ్ముతూ పట్టుబడ్డాడు. ఇప్పటికీ ఆ కేసు ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిండంట. దొంగతనాలు, కిరాయి హత్యలు తప్ప చేసిందేమీ లేదు’’ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కదానిని నిరూపించినా.. సభలో ముక్కు నేలకు రాసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళతానని సవాల్‌ చేశారు. నిరూపించకపోతే మంత్రి వెంకట్‌రెడ్డితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చెత్తగాళ్ల, చెత్త మాటలు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.


  • 16 ఏళ్లు కోర్టు చుట్టూ..

మంత్రి కోమటిరెడ్డి మరోసారి స్పందిస్తూ.. హత్య కేసుల్లో జగదీశ్‌రెడ్డి కోర్టు చుట్టూ 16 ఏళ్లు తిరిగిన విషయం రికార్డుల్లోనూ ఉంటుందన్నారు. బంకులో దొంగతనం కేసు, దొంగ మద్యం అమ్మిన కేసు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. సవాల్‌ను స్వీకరిస్తున్నానని, వాటిని నిరూపిస్తానని చెప్పారు. లేదంటే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. కాగా, జగదీశ్‌రెడ్డి.. స్పీకర్‌ తీరుపై అభ్యంతరం తెలిపారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుని.. శాసనసభ్యుల పట్ల జగదీశ్‌రెడ్డి ఇష్టానుసారంగా, అడ్డగోలుగా మాట్లాడారని, ఆయన మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.


అయితే కాంగ్రెస్‌ నాయకులు తనపై మూడు హత్య కేసులు పెట్టారని, కోర్టు మూడు కేసుల్లోనూ తనను కోర్టు నిర్దోషిగా తేల్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు తప్ప.. తనపై మరే కేసులూ లేవన్నారు. ఈ విషయంలో హౌస్‌ కమిటీ వేయాలని స్పీకర్‌ను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘మా నాయకుడు కేసీఆర్‌ సత్య హరిశ్చంద్రుడే. మీ లాగా సంచులు మోసే చంద్రుడు కాదు. చంద్రుడి సంచులు మోసి జైలుకు పోయింది మీరు’’ అని అన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 03:41 AM

Advertising
Advertising
<