Share News

GHMC: ఉద్రిక్తంగా జీహెచ్ఎంసీ సమావేశం

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:14 AM

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది. అంతుకు ముందు ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు

GHMC: ఉద్రిక్తంగా జీహెచ్ఎంసీ సమావేశం

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్‌లో పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది. అంతుకు ముందు ప్రధాన కార్యాలయం వద్ద నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ముందు ఫ్లకార్డులు పట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తరువాత సమావేశం ప్రారంభమయ్యాక కూడా రచ్చ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియంను చుట్టుముట్టారు.


బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్‌కు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలత మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. వీరిద్దరూ పార్టీ మారడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. పైగా మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2024 | 12:17 PM