Hyderabad: 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్..
ABN, Publish Date - Sep 17 , 2024 | 08:52 AM
సంక్రాంతి(Sankranti)కి సుమారు నాలుగునెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్త్‌లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్‌లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
- సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే రైళ్లలో ‘నో రూమ్’ స్టేటస్
- బుకింగ్ ఓపెన్ చేసిన కాసేపటికే రిగ్రెట్
హైదరాబాద్ సిటీ: సంక్రాంతి(Sankranti)కి సుమారు నాలుగునెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్త్‌లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్‌లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి జనవరి 11, 12 13 తేదీల్లో ఏపీవైపు వెళ్లే రైళ్లన్నింటిలో బెర్తులన్నీ అప్పుడే ఫుల్ అయిపోయాయి.
ఇదికూడా చదవండి: Ganesh Laddu Record: రికార్డులన్నీ బ్రేక్.. సంచలన ధర పలికిన గణేశుడి లడ్డూ
ఆ రైళ్లలో బెర్తు దొరికితే గగనమే..
సంక్రాంతికి వారం ముందు నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లలో బెర్తులు దొరికితే ప్రయాణికులు గగనంగా భావిస్తారు. మరోవైపు బెర్తులు దొరకని వారు ప్రయాణానికి సమయం ఉండడంతో వెయిటింగ్ లిస్టు టికెట్‌తో ఎలాగోలా ఊరికి వెళ్లొచ్చులేనని సంతృప్తి పడుతున్నారు. కానీ, కొన్ని ప్రధాన రైళ్లలో రిగ్రెట్(నో రూమ్) స్టేటస్ కనిపించడంతో వెయిటింగ్ లిస్ట్ కూడా దొరకని వారు ఏం చేయాలా? అని ఆందోళన చెందుతున్నారు. ఈనెల 11,12 తేదీల నుంచేసంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు రైళ్లల్లో రిజర్వేషన్ చేసుకోవడంతో నగరం నుంచి వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్లు నిండిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం(Vijayawada, Visakhapatnam) వైపు వెళ్లే అన్ని రైళ్లల్లో బెర్తులన్నీ అయిపోయి, వెయిటింగ్ లిస్టు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే, నగరం నుంచి తిరుపతి వైపు వెళ్లే వెంకటాద్రి, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వచ్చే జనవరి 11, 12, 13వ తేదీల్లో వెయిటింగ్ లిస్టు టికెట్ దొరుకుతోంది.
ప్రత్యేక రైళ్ల కోసం డిమాండ్..
నగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు వచ్చే జనవరి 11, 12వ తేదీల్లో ప్రత్యేక రైళ్ల ప్రకటన కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సికింద్రాబాద్- విశాఖ వైపు వెళ్లే గరీబ్‌రథ్ రైళ్లలో రిగ్రెట్ కనిపిస్తుండగా, దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ తరగతుల్లోనూ 250కి పైగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. విశాఖ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, నాందేడ్ ఎస్‌బీపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గోదావరి, లింగంపల్లి - నర్సాపూర్(Lingampally - Narsapur), నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో అన్ని తరగతుల రిజర్వేషన్ పూర్తయి రిగ్రేట్ స్టేటస్ కనిపిస్తోంది.
షిరిడి-విశాఖపట్నం ఎన్‌ఎస్ఎల్‌ఎన్‌ఎస్ ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 11, 12వ తేదీలలో స్లీపర్‌క్లాస్ రిగ్రెట్ చూపుతుండగా, ఏసీ తరగుతుల్లో 300పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. లింగంపల్లి నుంచి విశాఖపట్టణం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు(Janmabhoomi Express train) సెకండ్ సిట్టింగ్ సీట్లన్నీ అయిపోగా, చైర్‌కార్‌లో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీంతో దక్షిణమధ్య రైల్వే నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఉన్న మార్గాల్లో అవసరమైన మేరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ఎన్ని నడిపేదీ త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు
ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?
ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం..
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 17 , 2024 | 08:52 AM