Hyderabad: అమెరికా కల.. సాకారం ఇలా..
ABN, Publish Date - Aug 17 , 2024 | 09:56 AM
అమెరికా(America)లో ఉన్నత విద్యనభ్యసించడం ప్రతిఒక్క విద్యార్థి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ యూనివర్సిటీ(University)లో చదవాలి ? దానికయ్యే ఖర్చెంత ? ఉద్యోగావకాశాలు ఎలా ? అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి.
- కిటకిటలాడిన ఎడ్యుకేషన్ ఫెయిర్
- సందేహాలు నివృత్తి చేసుకున్న విద్యార్థులు
హైదరాబాద్ సిటీ: అమెరికా(America)లో ఉన్నత విద్యనభ్యసించడం ప్రతిఒక్క విద్యార్థి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ యూనివర్సిటీ(University)లో చదవాలి ? దానికయ్యే ఖర్చెంత ? ఉద్యోగావకాశాలు ఎలా ? అన్నదానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. వాటన్నింటిని నివృత్తి చేసేందుకు అమెరికా రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం మాదాపూర్ ఐటీసీ కోహినూర్ హోటల్(Madapur ITC Kohinoor Hotel)లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈనెల 16 నుంచి 25 వరకు జరిగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్‌లారన్ ప్రారంభించారు. ఇందులో 55 యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొనగా, 1500 మందికి పైగా విద్యార్ధులు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అలెగ్జాండర్ మాట్లాడుతూ భారతీయ విద్యార్ధుల్లో అధికశాతం ఉన్నతవిద్య కోసం అమెరికాను ఎంచుకుంటున్నారన్నారు. యూఎ్‌సలో విద్యనభ్యసిస్తున్న భారతీయుల్లో అధికశాతం ఏపీ, తెలంగాణ వారు ఉంటున్నారన్న ఆయన హైదరాబాద్ నుంచి తమ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు కాగా, విద్యార్థి వీసా ప్రక్రియ, స్కాలర్‌షి్‌పలు, క్యాంపస్ జీవితం తదితరాంశాలను కాన్సులేట్ అధికారులు విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ ఫెయిర్‌కు వచ్చేడాది జూన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే వారే కాకుండా తమ అండర్ గ్రాడ్యుయేషన్‌ను యూఎ్‌సలో అభ్యసించాలని ఆరాటపడుతున్న విద్యార్థులు పలువురు హాజరుకావడం విశేషం.
మా అమ్మాయి కోసం వచ్చాం
మా అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. మరో మూడేళ్ల తర్వాత యూఎస్‌కు పంపాలనేది ఆలోచన. ఇక్కడికి రావడం వల్ల స్కాలర్‌షిప్ విధానం ఎలా ఉంటుంది? ఫీజులు ఎంత ఉంటాయి ? అనే అంశాలు తెలిశాయి.
-సూర్య, ఐటీ ఉద్యోగి
సందేహాలు నివృత్తి
మేము ఇంజినీరింగ్ చేస్తున్నాము. యూ ఎస్‌లో ఎంఎస్ చేయాలనేది డ్రీమ్. ఇప్పటినుంచే తెలుసుకుంటే మంచిదని వచ్చాం. సైబర్ సెక్యూరిటీలో కోర్సు చేయాలని ఉంది. ఫీజు కాస్త ఎక్కువనే చెబుతున్నారు. స్కాలర్‌షిప్ వస్తే ఇబ్బంది ఉండదు.
- సబిత (వరంగల్), సువిత
(కామారెడ్డి), ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్
ప్రైవేట్ వర్సిటీలే అధికం
మేం వరంగల్ నుంచి వచ్చాం. అందరం ఫైనలియర్ విద్యార్థులం. యూఎ్‌సకు వెళ్లాలనుకుంటున్నాం. అత్యధిక శాతం ప్రైవేట్ యూనివర్సిటీలే వచ్చాయి. సమాచారం బాగానే ఇచ్చారు. మా ప్లానింగ్‌కు మంచిగా తోడ్పడుతుంది.
-రిషి, రోహన్, కృతిక, రేవంత్, వరంగల్
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 17 , 2024 | 09:56 AM