Hyderabad: టూరిజం సమాచారం కోసం హెల్ప్‌డెస్క్..
ABN, Publish Date - Dec 20 , 2024 | 08:54 AM
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు టూరిజంపై పూర్తి సమాచారం కోసమే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో తెలంగాణ టూరిజం హెల్ప్‌డెస్క్ సెంటర్‌ను ప్రారంభించామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు.
- మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు టూరిజంపై పూర్తి సమాచారం కోసమే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో తెలంగాణ టూరిజం హెల్ప్‌డెస్క్ సెంటర్‌ను ప్రారంభించామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు. గురువారం ఎయిర్‌పోర్టులో టూరిజం సమాచార నూతన కేంద్రాన్ని ఆయన జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణీకర్(GMR CEO Pradeep Phanikar)తో కలిసి ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానం దిగగానే పర్యాటక కేంద్రాల సమాచారం తెలుసుకునేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వివరించారు. దేశీయ, విదేశీ ప్రయాణికులు పర్యాటక హెల్ప్‌డెస్క్‌ను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
ఈ సెంటర్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థల చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకా్‌షరెడ్డి (ఐపీఎస్) పర్యాటక సంచాలకులు హనుమంతు, జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్ ఏ1
ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!
ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 20 , 2024 | 08:54 AM