Hyderabad: మల్కాజిగిరిలో ఎప్పుడూ విభిన్నమైన తీర్పే...
ABN, Publish Date - Jun 05 , 2024 | 11:26 AM
దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్‌లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది.
- ఒక్కోసారి ఒక్కో పార్టీకి ప్రజల మద్దతు
- సర్వే సత్యనారాయణ నుంచి ఈటల వరకు..
హైదరాబాద్: దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్‌లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది. అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మార్పును ఆశిస్తూ కొత్త వారిని గెలిపిస్తున్నారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ 93,226 వేల ఓట్లతో విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి 28,371 ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 10,919 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే పార్టీకి మద్దతు తెలపకుండా ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త అభ్యర్థికే జై కొడుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఔర్ ఏక్ బార్ అసద్..! హైదరాబాద్‌లో విజయదుందుభి
మోదీ ప్రచారంతో..
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి చెందిన ఈటల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్‌పై దృష్టి సారించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ ప్రచారంతో తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలోని ఉద్యమకారులను ఒక్కొక్కరిగా కాషాయం గూటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యా రు. ప్రచారం నుంచి పోల్ మేనేజ్‌మెంట్ వరకు పకడ్బందీగా చేయడంతో ఘనవిజయం సాధించారు. కాగా, బలమైన అభ్యర్థిని కారు పార్టీ బరిలో దింపకపోవడంతోనే బీజేపీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తొలిసారి వికసించిన కమలం
మల్కాజిగిరి గడ్డపై తొలిసారి కాషాయం జెండా ఎగరేసింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 9లక్షల 91 వేల 042 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి 5లక్షల 99వేల 567 ఓట్లు, బీఆర్‌ఎ్‌సకు 3లక్షల 486 ఓట్లు వచ్చాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 05 , 2024 | 11:26 AM