ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : అడ్డగోలుగా ఎన్‌వోసీలు!

ABN, Publish Date - Aug 21 , 2024 | 02:48 AM

జలవనరుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా సంరక్షించాల్సిన అధికారులే అక్రమాలకు...

  • నీటిపారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ

  • కలెక్టర్లకు తెలియకుండానే ఇచ్చిన అధికారులు!

  • ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులపై హైడ్రా ఆరా

  • రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్‌ భేటీ

  • నీటిపారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ.. కలెక్టర్లకు తెలియకుండానే ఇచ్చిన అధికారులు!

  • ఇరిగేషన్‌ శాఖ ఇచ్చిన ఎన్‌వోసీల వివరాల సేకరణ

  • నిర్మాణదారులు, అధికారుల్లో కలవరం!

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జలవనరుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా సంరక్షించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడటంపై రెవెన్యూ శాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ మంగళవారం రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు.

ఎఫ్‌టీఎల్‌పై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలేంటి? నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీల) జారీలో రెవెన్యూ పాత్ర ఎంత ఉందనేదానిపై ఆరా తీశారు. ఎఫ్‌టీఎల్‌ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన తప్పిదాలకు నీటి పారుదల శాఖ బాధ్యత ఎంత ఉంది? రెవెన్యూ శాఖ పాత్ర ఏంటి? అనే విషయాలను తెలుసుకున్నారు. చెరువులు, నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన భవనాలకు ఏ నిబంధనల ప్రకారం నీటిపారుదల శాఖ అనుమతి ఇచ్చింది, ఇందులో కలెక్టర్ల పాత్ర ఎంత ఉంది, అసలు కలెక్టర్లకు తెలియకుండా నీటి పారుదల శాఖ అధికారులే అన్నీ తామై ఎఫ్‌టీఎల్‌పై నిరభ్యంతర పత్రాలు ఇవ్వడం చట్టబద్ధమేనా?


అనే కోణంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించినట్లు తెలిసింది. కాగా, దీనిపై కలెక్టర్‌కే పూర్తి హక్కులున్నాయని అధికారులు వివరించినట్లు సమాచారం. ఇక ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి తొలుత (2012 ఏప్రిల్‌ 7న) విడుదలైన జీవో 168 ఏం చెప్పింది, ఆ తరువాత నీటి పారుదల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయనే అంశంపైనా రెవెన్యూ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్‌ చర్చించినట్లు తెలిసింది. వీటితోపాటు వాల్టా చట్టం, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులు, కోర్టు కేసుల సమయంలో ప్రభుత్వం చేసిన పలు సవరణల పైనా చర్చించినట్లు సమాచారం.


ఉమ్మడి ఏపీలో 168 జీవో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు.. నదులు, కాలువలు, చెరువులు, కుంటల సమీపంలో నిర్మాణాలపై కొన్ని ఆంక్షలు విధిస్తూ జీవో 168ను జారీ చేసింది. జలవనరుల సమీపంలో రీక్రియేషన్‌ కార్యక్రమాలు, గ్రీన్‌ బఫర్‌జోన్‌ పరిధిలో ఎలాంటి భవనాల నిర్మాణం చేపట్టకూడదని జీవోలో పేర్కొంది.

ఈ మేరకు నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, హెచ్‌ఎండీఏ, యూడీఏ పరిధిలో నదులు, చెరువులు, కుంటలకు ఎఫ్‌టీఎల్‌ను ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. కానీ, నీటిపారుదల శాఖ అధికారులు వాటిని బహిర్గతం కానివ్వలేదని, తమకు తోచినట్లు చెరువులు, కుంటలను కుదించి ఎఫ్‌టీఎల్‌ అనుమతులు జారీ చేశారని హైడ్రా గుర్తించింది.


వాస్తవానికి ఎఫ్‌టీఎల్‌ మీద తహసీల్దారు, సర్వేయర్‌, నీటిపారుదల శాఖ ఏఈ.. మునిసిపల్‌, అటవీ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షేత్ర స్థాయి పర్యటన తరువాత నివేదిక మాత్రమే ఇవ్వాలి. కానీ, ఏకంగా ఎన్‌వోసీలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో ఇక్కడే అవకతవకలు జరిగాయన్న అనుమానాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటివరకు ఇరిగేషన్‌ అధికారులు ఎన్ని ఎన్‌వోసీలు జారీ చేశారనే లెక్కలను హైడ్రా అధికారులు సేకరిస్తున్నారు.

రికార్డుల్లోనే కనిపిస్తున్న చెరువులు..

హైదరాబాద్‌ పరిధిలో 28 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 1078, మేడ్చల్‌లో 620, మెదక్‌లో 589, సంగారెడ్డిలో 603, సిద్దిపేటలో 347, యాదాద్రి జిల్లాలో 267 చెరువులు కలిపి మొత్తం 3,532 చెరువులు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పుడు మిగిలిన చెరువులు 185 మాత్రమేనని, ఓఆర్‌ఆర్‌ లోపల 404 చెరువులు ఉన్నాయని పురపాలక శాఖ అధికారుల సమాచారం. ఈ లెక్కలపై హైడ్రా దృష్టి సారించడంతో నిర్మాణదారులు, అధికారుల్లో కలవరం మొదలైంది.

Updated Date - Aug 21 , 2024 | 07:21 AM

Advertising
Advertising
<