Hyderabad: ఐదునెలల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత..
ABN, Publish Date - May 09 , 2024 | 11:55 AM
అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల(BRS NRI Coordinator Mahesh Bigala) పేర్కొన్నారు.
హైదరాబాద్: అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల(BRS NRI Coordinator Mahesh Bigala) పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రతినిధులు అనిల్‌కూర్మాచలం, తదితరులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదికూడా చదవండి: సూర్యాపేట కాంగ్రెస్ నేత.. వడ్డె ఎల్లయ్య మృతదేహం లభ్యం
కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల్లో భయం మొదలై బీఆర్‌ఎస్ పై కొందరు పనిగట్టుకొని విషప్రచారం మొదలుపెట్టారన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ(Prime Minister Modi), కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు కేసీఆర్ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొంటోందని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓటు వేయడం వృథా..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 09 , 2024 | 11:55 AM