Hyderabad: న్యూ ఇయర్ వేడుకలపై నిఘా..
ABN , Publish Date - Dec 19 , 2024 | 08:17 AM
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌తో పాటు.. ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి(Excise and Enforcement Director Kamalasan Reddy) అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
- రైళ్లు, బస్సుల్లో తనిఖీలను ముమ్మరం చేయాలి
- సమీక్షా సమావేశంలో కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా గంజాయి, డ్రగ్స్‌తో పాటు.. ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి(Excise and Enforcement Director Kamalasan Reddy) అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆబ్కారీ భవన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ అధికారులు, ఎస్‌టీఎఫ్ టీమ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌లు, శివారు ప్రాంతాల్లో జరిగే న్యూ ఇయర్ వేడుకల ఈవెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్.. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు
ఈనెల 20 నుంచి జనవరి మొదటివారం వరకు సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకుండా నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టి, అక్రమార్కుల ఆటకట్టించాలని సూచించారు. ప్రధానంగా రైళ్లు, ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. ఈవెంట్ మేనేజర్ల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని, నానక్‌రాంగూడ, సింగరేణి కాలనీ, ధూల్‌పేట, ఎల్‌బీనగర్(Nanakramguda, Singareni Colony, Dhulpet, LB Nagar), కర్మన్‌ఘాట్, గోల్కొండ, పుప్పాలగూడ, మణికొండ, రామకృష్ణకాలనీ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
సమావేశంలో జాయింట్ కమిషనర్లు ఖురేషి, కేఏబీ శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్, అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్లు ఆర్.కిషన్, అనిల్ కుమార్‌రెడ్డి, ప్రవీణ్, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, శంషాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, కె.నవీన్, ఫయాజుద్దీన్, ఉజ్వలరెడ్డి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News