Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ABN, Publish Date - Nov 14 , 2024 | 05:11 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. . ఈ కేసులో తెలంగాణ హైకోర్టును ఇవాళ(గురువారం) అదనపు ఎస్పీ భుజంగరావు ఆశ్రయించారు. మధ్యంతర బెయిలు పొడిగించాలని న్యాయ స్థానాన్ని కోరారు. ఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌ను నాంపల్లి కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(గురువారం) సాయంత్రంతో మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో హైకోర్టును అదనపు ఎస్పీ భుజంగరావు ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును గడువు పొడిగించింది. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయడంపై మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు అధికారులు.. ఇక నుంచి రాజకీయ నేతల వరుస వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మరి నెక్ట్స్ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు? ఎవరెవరికి ఈ కేసులో ప్రమేయం ఉందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నట్లు పొలిటికల్ బాంబులు ఈ కేసులోనే పేలనున్నాయా? మరేదైనా కేసులు ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది.
మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావును ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. ప్రణీత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (SIB)లో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుళ్లను పిలిచి విచారిస్తున్నారు. SIBలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో SIBలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు గానూ దర్యాప్తు అధికారులు సైబర్ క్రైమ్, నిపుణుల సహకారం తీసుకుంటున్నారు.
ఇదే సమయంలో.. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన రికార్డ్స్ ధ్వంసమైన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అటు.. వికారాబాద్ అడవుల్లో, మూసీ నదిలో హార్డ్ డిస్కుల శకలాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్ వంతెన కింద మూసీ నది ప్రవాహంలో ఆరు హార్డ్ డిస్క్‌లు లభ్యమయ్యాయి. దీంతో.. ఇందులోని డేటాను రాబట్టడంపై పోలీసులు దృష్టి సారించారు. దీంతో పాటు పలువురి ఇళ్లలో సోదాలు కూడా కొనసాగాయి. హైదరాబాద్ మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసంలోనూ సోదాలు జరిగాయి. అంతకుముందు ఓ న్యూస్ ఛానెల్ యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించి.. రెండు ల్యాప్‌టాప్స్, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నా విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..
BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
HYDRA: ‘హైడ్రా’ రూటు మారింది.. కూల్చివేతలకు తాత్కాలిక విరామం
Read Latest Telangana News and TELUGU NEWS
Updated Date - Nov 14 , 2024 | 05:16 PM