ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలకు రిమాండ్

ABN, Publish Date - Apr 02 , 2024 | 11:15 AM

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను కాసేపట్లో పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నేటితో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఈరోజు (మంగళవారం) ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు (Nampally Court) న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను కాసేపట్లో పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించనున్నారు.

Viral Video: కొబ్బరికాయను తల మీద కొట్టుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!


కాగా.. ఈ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి సారి రిటైర్డ్ ఐజి పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. రిటైర్డ్ ఐజితో పాటు తిరుపతన్న, భుజంగ రావు, రాదాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణు గోపాల్ రావు కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిన తీరు మొదలు.. బీఆర్‌ఎస్‌ కోసం పోలీసులు డబ్బును తరలించడం.. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నగదును సీజ్‌ చేయడం వరకు ప్రభాకర్‌రావు ‘స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌’ విధులను రాధాకిషన్‌ వివరించినట్లు రిమాండ్‌ రిపోర్టు స్పష్టం చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును ఇంటెలిజెన్స్‌ చీఫ్‌(ఓఎస్‌డీ)గా నియమించడం గత ప్రభుత్వ పెద్దల వ్యూహాత్మక చర్య అని రాధాకిషన్‌రావు పేర్కొన్నట్లు దర్యాప్తు అధికారులు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

TS News: బండి సంజయ్ ‘రైతు దీక్ష’ ప్రారంభం

Former Chief Minister: వెనక్కి నడిస్తే కాళ్లకు బలం.. అంటూ మాజీసీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 11:49 AM

Advertising
Advertising