Adluri Laxman: అన్నివర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారు
ABN, Publish Date - Oct 19 , 2024 | 09:15 PM
అన్నివర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: అన్నివర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో దళితులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక దళితుడు కూడా వీసీ కాలేదని అన్నారు. మహిళా యూనివర్సిటీకి ఒక గిరిజన మహిళను వీసీగా రేవంత్ రెడ్డి నియమించారని చెప్పారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని,మూడెకరాల భూమి ఇస్తానని మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు.
మాదిగలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మాదిగలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. వీసీల నియామకంలో ప్రాధాన్యత ఇచ్చి దళితులపైన అభిమానాన్ని రేవంత్ రెడ్డి చూపించారని అన్నారు. మాదిగల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో చదువుకుని వచ్చానన్న అహంకారంతో రేవంత్‌రెడ్డిని స్పెల్లింగ్ చెప్పాలని సవాల్ విసురుతున్నాడని అన్నారు. కేటీఆర్‌తో స్పెల్లింగ్ ఛాలెంజ్‌కు తాను సిద్దమని కవ్వంపల్లి సత్యనారాయణ సవాల్ విసిరారు.
మున్సిపల్ మంత్రిగా ఉండి మూసీ కోసం ఏం చేశాశ్ కేటీఆర్...
కేటీఆర్ నువ్వెంత...నీ చదువెంత..? అమెరికాలో నువ్వు నాసాలో పని చేయలేదు..నాలాలో పని చేశావు. ఇక్కడ సీటు రాక అమెరికా పోయి చదువుకున్నావు. నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి ఎదగలేదు.. 2009లో 70 ఓట్లతో గెలిచిన విషయం మరిచిపోకు అని చెప్పారు. పదేళ్లు మున్సిపల్ మంత్రిగా ఉండి మూసీలో తట్టెడు మట్టి తీయలేదని అన్నారు.మూసీలో మగ్గిపోతున్న పేదల గురించి కేసీఆర్ ఏనాడు పట్టించు కోలేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే...అందుకే కలిసి నిరసనలు చేస్తున్నాయని అన్నారు. నిరుద్యోగ యువతను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Oct 19 , 2024 | 09:29 PM