Students: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
ABN, Publish Date - Mar 18 , 2024 | 01:17 PM
Telangana: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
హైదరాబాద్, మార్చి 18: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Mallareddy Agriculture University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ (Students) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన విద్యార్థులు... మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మైనం పల్లి హనుమంత్ రావు కాలేజ్‌కు వచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న ఆయన.. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?
AP Politics: జగన్ వెనకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 18 , 2024 | 01:19 PM