Allu Arjun Arrest: అల్లు అర్జున్ను అరెస్టు చేసింది ఎవరో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:39 PM
పుష్పరాజ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్‌ని నిజ జీవితంలో సంధ్య థియేటర్ ఘటన నుంచి తప్పించుకోలేకపోయారు. గురువారం బన్నిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు, నేషనల్ మీడియాలు దీనిపై అనేక కథనాలు ప్రచురించగా అరెస్టు వార్త సెన్సేషన్‌గా మారింది.
హైదరాబాద్: పుష్ప-2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ షెకావత్ నుంచి తప్పించుకునేందుకు పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అతన్ని ముప్పుతిప్పలు పెడతాడు. పుష్పరాజ్ చేస్తున్న ఎర్రచంద్రనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి షెకావత్ చేయని ప్రయత్నమంటూ ఉండదు. అయితే అనేక రకాల ఉపాయాలతో పుష్ప తప్పించుకుంటూ ప్రేక్షకులను అబ్బురపడుస్తాడు. ఇది కేవలం రీల్ లైఫ్‌కు మాత్రమే పరిమితం, కానీ రియల్ లైఫ్ కథ మరోలా ఉంది.
అరెస్టు చేసింది ఎవరంటే..
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గురువారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు పుష్ప(అల్లు అర్జున్)ను అరెస్టు చేసిన పోలీసు అధికారి గురించి తెగ చర్చ నడుస్తోంది. ఎవరూ అరెస్టు చేశారంటూ నెటిజన్లు తెగ గూగుల్ చేస్తున్నారు. అతని గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్టు చేసింది సీఐ బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే బన్నికి సీఐ పెద్ద అభిమాని. జీవితంలో ఒక్కసారైనా అభిమాన హీరో బన్నిని చూడాలని కోరుకునేవారట రాజు నాయక్. అయితే ఏకంగా అతన్నే అరెస్టు చేస్తానని ఏమాత్రం ఊహించలేకపోయానని సీఐ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అభిమాన నటుడిని చూశాననే ఆనందం ఓ పక్క, తన చేతులతోనే అతన్ని అరెస్టు చేశానని సీఐ బాధపడినట్లు తెలుస్తోంది. కానీ విధి నిర్వహణలో భాగంగా తన పని తాను చేసినట్లు సీఐ బానోత్ నాయక్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవడం ఎవ్వరికైనా చాలా వింతంగా అనిపిస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
విడుదలైన పుష్ప..
పుష్పరాజ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ నిజ జీవితంలో సంధ్య థియేటర్ ఘటన నుంచి తప్పించుకోలేకపోయారు. గురువారం బన్నిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు, నేషనల్ మీడియాలు దీనిపై అనేక కథనాలు ప్రచురించగా అరెస్టు వార్త సెన్సేషన్‌గా మారింది. కాగా, హైదరాబాద్ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు నిన్న రిమాండ్ విధించగా అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అనంతరం తెలంగాణ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించడంతో మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. ఎంతో ఉత్కంఠ నడుమ శుక్రవారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Khammam: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితికి బీఆర్ఎస్సే కారణం: భట్టి విక్రమార్క..
Mohan Babu:మోహన్‌బాబును విచారిస్తోన్న పోలీసులు
Updated Date - Dec 14 , 2024 | 05:35 PM