ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కలకలం..

ABN, Publish Date - Nov 23 , 2024 | 08:39 PM

నీలోఫర్ ఆస్పత్రిలో నెల రోజుల పసికందును గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేయడం కలకలం సృష్టిస్తోంది. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల కిందట బాబు జన్మించాడు.

హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో నెల రోజుల పసికందును గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేయడం కలకలం సృష్టిస్తోంది. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల కిందట బాబు జన్మించాడు. చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో తల్లి, అమ్మమ్మ వైద్యం కోసం నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే చికిత్స కోసం ఎదురుచూస్తున్న వారికి ఆస్పత్రి సిబ్బందినని చెప్పిన ఓ గుర్తుతెలియని మహిళ.. వారి వద్ద నుంచి చిన్నారిని తీసుకుని వెళ్లిపోయింది. అయితే ఎంతకీ ఆమె రాకపోవడంతో వారిద్దరూ ఆస్పత్రి మెుత్తం వెతికారు.

Hyderabad: కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు.. ఎందుకంటే..


అయినప్పటికీ మహిళ, చిన్నారి జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో కంగారు పడిన బాధితులు విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు. అందరూ కలిసి వెతికినా చిన్నారి జాడ మాత్రం తెలియరాలేదు. దీంతో బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడని అర్థం చేసుకున్న బాధిత కుటుంబ సభ్యులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు.

KTR: ఆ భూములు లాక్కుంటే ఊరుకోం.. రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్


చిన్నారి కిడ్నాప్‌కు ఆస్పత్రి సెక్యురిటీ వైఫల్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అయితే ఇటీవల ఆస్పత్రుల నుంచి పురిటిబిడ్డలను ఎత్తుకెళ్తున్న కేసులు తరచూ నమోదు అవుతున్నాయి. ఈ ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. కేటుగాళ్లు కాసుల కోసం కక్కుర్తి పడుతూ చిన్నారుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్నారు. చిన్నారులను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Priyanka Gandhi Journey: ప్రధాన కార్యదర్శి నుంచి పార్లమెంట్ దాకా.. ప్రియాంకా ప్రయాణం ఇదే..

Minister Raja Narasimha: అలాంటి పరిస్థితి తెలంగాణకు రావొద్దు: మంత్రి రాజనర్సింహ..

Updated Date - Nov 23 , 2024 | 08:41 PM