ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balka Suman: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి: బాల్క సుమన్..

ABN, Publish Date - Oct 07 , 2024 | 02:57 PM

బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.

BRS Leader Balka Suman

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు గొప్పలు చెప్తున్నారని, తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తోందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఆగ్రహించారు. నిన్న(ఆదివారం) హైదరాబాద్ శిల్పాకళావేదికలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందించే కార్యక్రమంలో సీఎం పచ్చి అబద్ధాలు చెప్పాలని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ భవన్‌లో బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు.


ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.."తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. యూత్ డిక్లరేషన్ సభలో నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి చెప్పించారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను నమ్మించి మోసం చేశారు. ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీఆర్ఎస్ చెప్పింది. ప్రైవేట్ రంగంలో 24లక్షలకు పైగా ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో వచ్చాయి. 2.27లక్షల ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది.


టీచర్ ఉద్యోగాల కోసం మేము 6వేల ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి 5వేల ఉద్యోగాలు యాడ్ చేసింది. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయడం లేదు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారు. మూటలు సర్దడం, ఢిల్లీకి పంపడంలో ఆయన బిజీగా ఉన్నారు. నిరుద్యోగులను ముఖ్యమంత్రి ఎందుకు కలవడం లేదు. ఒక్క మంత్రి అయినా వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారా?. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగుల చుట్టూ తిరిగారు. రాష్ట్రం అంతా నిరుద్యోగ యాత్రలు చేయించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. 18ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ఎలెక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఆ హామీని అటకెక్కించారు" అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

KTR: మూసీ ఆర్భాటం ఎవరి కోసం.. కేటీఆర్ సూటి ప్రశ్న

Akkineni Nagarjuna: హీరో నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

Updated Date - Oct 07 , 2024 | 03:02 PM