ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bandi Sanjay: పార్లమెంట్ ఎన్నికలకు ఆ పార్టీలు ఒక్కటవుతాయి

ABN, Publish Date - Feb 11 , 2024 | 09:04 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బీజేపీపై కుట్రలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. ఆదివారం నాడు సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు రాగానే రెండు పార్టీలు ఒక్కటవుతాయన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు అనుకూలంగా కాంగ్రెస్ పని చేస్తోందని ఆరోపించారు. బీజేపీని బదనం చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖత్వ పార్టీ బీజేపీ కాదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పుకునే దమ్ము బీఆర్ఎస్‌కు లేదన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయని తెలిపారు. ఫామ్ హౌస్‌లో ఉంటూ కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Updated Date - Feb 11 , 2024 | 09:05 PM

Advertising
Advertising