ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Beerla Ilaiah: గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్‌కు నమ్మకం ఉందా..? :బీర్ల ఐలయ్య

ABN, Publish Date - Jul 20 , 2024 | 09:06 PM

రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.

Beerla Ilaiah

హైదరాబాద్: రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు.  అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌ను కేసీఆర్ అవమానించారని ధ్వజమెత్తారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటని అన్నారు.


తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గతంలో వారు గవర్నర్‌ను ఎలా అవమానించారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి ఏ మాత్రంవిలువ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా..?  అని నిలదీశారు. ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని చెప్పారు.


పదేళ్ల పాటు ఆయన గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నల వర్షం కురింపించారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ మౌనవ్రతం ఎందుకు పాటించారని ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి కేటీఆర్‌క సిగ్గుందా అని ప్రశ్నించారు. ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా అదే రాజ్ భవన్‌లో ప్రమాణం చేయించినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా..? అని ఫైర్ అయ్యారు. ప్రొటోకాల్ గురించి కేటీఆర్ తెగ గింజుకుంటున్నారన్నారు. అధికార మదంతో ఆ నాడు విర్రవీగి ఈరోజు రాజ్ భవన్ గేట్ ముందు హాహాకారాలు చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కనీసం సెక్రటేరియట్లోకి కూడా అనుమతివ్వకుండా అడ్డుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని కేటీఆర్ అంటున్నారని చెప్పారు.


అధికారం పోగానే హైదరాబాద్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. నిరుద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని గుర్తుచేశారు. గ్రూప్ 2 పరీక్ష ను వాయిదా వేశామని, పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఉద్ఘాటించారు. పదేళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్ల మీదకు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉంటే కల్వకుంట్ల మాత్రం కడుపులో కుట్రలతో రగిలిపోతుందని ఆరోపణలు చేశారు. గవర్నర్, రాష్ట్రపతి దగ్గరికి పోయినా బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారానికి స్పందన ఉండదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి కల్వకుంట్ల చేస్తున్న కుట్రలు ఫలించవని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని బీర్ల ఐలయ్య హెచ్చరించారు.

Updated Date - Jul 20 , 2024 | 09:48 PM

Advertising
Advertising
<