Maheshwarreddy: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు..
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:08 PM
Telangana: పాలనను గాలికి వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సాహించేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేసుకోవాలంటే భయపడుతున్నారన్నారు.
హైదరాబాద్, జూలై 1: పాలనను గాలికి వదిలేసి తెలంగాణ (Telangana) ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (BJLP Leader Maheshwarreddy) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సాహించేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేసుకోవాలంటే భయపడుతున్నారన్నారు. ఉద్యోగాల కోసం బీజేవైఎం నేతలు పోరాడితే పోలీసులచే దాడి చేయించారన్నారు.
TS News: రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం.. ఉద్రిక్తత
నేడు గాంధీ ఆస్పత్రి వద్ద కవరేజ్‌కు వెళ్లిన మీడియాను కూడా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన అంటే.. ఆరునెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. ఎప్పటి వరకు ఉద్యోగాలు ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యేలు వలసపోతే వాళ్ళ ఇంటి వద్ద సావుడప్పు కొట్టమని రేవంత్ రెడ్డి చెప్పారని.. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఏ డప్పు కొట్టాలని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా మీద ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువలు గాదికొదిలేశారని విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సుప్రీం కోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పిందని గుర్తుచేశారు.
Vasudeva Reddy: గురుకుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు
రిజిస్టర్ పోస్టు, ఈ మెయిల్‌తో పాటు నేరుగా స్పీకర్ కార్యాలయంలో డిస్క్వొలిఫికేషన్ నోటీసు ఇస్తానన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఆరు అంశాలపై అవినీతిని ఆధారాలతో బయటపెట్టామన్నారు. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై చర్యలు తీసుకోని అసమర్థ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్యాడీ కొనుగోలు కోసం అసమర్థ కంపెనీలకు అనుమతి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరుగుతుంటే మంత్రికి చీమకుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమన్నారు. నీటిపారుదలలో కూడా ప్రైస్ ఎస్కలేషన్‌లో అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతానన్నారు. కాళేశ్వరంపై త్వరలోనే మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో బయటపెడతానన్నారు. దానం నాగేందర్‌పై డిస్ క్వాలిఫికేషన్ నోటీసు ఇస్తున్నట్లు చెప్పారు. తాము ఎప్పుడూ అప్రజాస్వామికంగా వ్యవహరించలేదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి....
Karnataka: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా?.. సిద్ధూ ఏమన్నారంటే?
Komatireddy: నల్గొండ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా..
Read Latest Telangana News AND Telugu News