ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: హైకోర్టులో రిలీఫ్ వచ్చినా.. ఈడీ ఎంట్రీతో ఆందోళనలో బీఆర్ఎస్

ABN, Publish Date - Dec 23 , 2024 | 10:39 AM

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గం ఆందోళనలో ఉంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు (Formula-E car race case)లో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (Ex Minister KTR)కు హైకోర్టులో రిలీఫ్ వచ్చినా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) ఎంట్రీతో బీఆర్ఎస్ (BRS) వర్గం ఆందోళనలో ఉంది. కేటీఆర్‌కు ఈ రేసు‌ కేసు టెన్షన్ పట్టుకుంది. మరోవైపు కేటీఆర్‌కు సోమవారం ఏసీబీ‌ నోటీసులు (ACB Notice) ఇస్తోందంటూ బీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ను ఏసీబీ విచారణకు పిలిస్తే.. ఏం చేయాలనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కాగా ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించిన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్ట్‌ చేయరాదంది. కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏసీబీకి, మునిసిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్‌కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తమది రెగ్యులర్‌ బెంచ్‌ కానందున.. రెగ్యులర్‌ రోస్టర్‌ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసుల విచారణ రోస్టర్‌ కలిగిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సెలవులో ఉండడంతో ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఎదుట శుక్రవారం (21వ తేదీ) విచారణకు వచ్చింది. క్వాష్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఉదయం 10.30 గంటలకు కేటీఆర్‌ తరఫు న్యాయవాదులు ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు కోరారు. లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసర విచారణకు ధర్మాసనం అనుమతించింది.


మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం కేటీఆర్‌ తరఫున వాదనలు ప్రారంభించారు. కేవలం రాజకీయ, వ్యక్తిగత కుట్ర కారణంగానే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. ‘హైదరాబాద్‌ ఖ్యాతిని పెంచేందుకు, దేశంలోనే ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహించిన తొలి నగరంగా నిలిపేందుకు అప్పటి ప్రభుత్వం కృషి చేసింది. అందులో భాగంగానే మూడు పక్షాల మధ్య మొదటి ఒప్పందం జరిగింది. ఈ రేసుకు ప్రజల్లో ఆసక్తి ఉంది. రూ. వందల కోట్ల వ్యాపారం జరిగింది. 9వ సీజన్‌ తర్వాత 10వ సీజన్‌ నిర్వహించే నాటికి స్పాన్సర్‌ వెనక్కి తగ్గడంతో రూ.కోట్లు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృథా కారాదని, ఈవెంట్‌ కుప్పకూలిపోకూడదని, హైదరాబాద్‌ ఖ్యాతి నిలబడాలని, ఫార్ములా రేస్‌ నిర్వహించిన అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే స్పాన్సర్‌గా ముందుకొచ్చి రెండో ఒప్పందం చేసుకుంది. పిటిషనర్‌ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు, నిధులు దుర్వినియోగం చేసినట్లు ఎక్కడా లేదు. ఏమైనా విభేదాలు ఉంటే ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌ క్లాజ్‌ ఉంది. కాబట్టి ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు ఎఫ్‌ఐఆర్‌లో లేదు.


మరోవైపు 14 నెలల కింద జరిగిన వ్యవహారానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి.. ‘లలిత కుమారి’ ‘చరణ్‌సింగ్‌’ తీర్పుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం తీవ్రమైన కేసు నమోదులో జాప్యం ఉంటే ప్రాథమిక దర్యాప్తు చేయాలి. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో ప్రాథమిక దర్యాప్తు ఎక్కడ ఉంది. కేసు నమోదు చేసిన అధికారే ప్రాథమిక దర్యాప్తు చేయాలి. కానీ, ఫిర్యాదుదారైన ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు ముందే పూర్తి చేసిన తర్వాత ఫిర్యాదు చేస్తుందా? ఇదెక్కడి విడ్డూరం? ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో) సంస్థను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదు? అంత దమ్ము ప్రభుత్వానికి ఉందా? ఆ సంస్థ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో కేసు వేసింది. అక్కడ పరువుపోతుందని ప్రభుత్వానికి తెలుసు. ఇది ఒక చట్టబద్ధమైన ఒప్పందం. దీనికి సంబంధించి వ్యక్తులకు క్రిమినల్‌ లయబిలిటీ అంటగట్టడం సరికాదు. ఈ-రే్‌సపై ప్రజల్లో ఆసక్తి ఉంది. భారీగా వ్యాపారం జరిగింది. రూ.110 కోట్ల లాభం వచ్చింది. లాభం వచ్చిన వ్యాపారాన్ని ఎవరైనా కాదనుకుంటారా? ప్రస్తుత ప్రభుత్వం అత్యంత చెత్త నిర్ణయం తీసుకుంది. డబ్బులు చెల్లించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కేవలం రాజకీయ కుట్రతో నమోదైన కేసు కాబట్టి ఇది న్యాయసమీక్షకు నిలవదు. కేసును కొట్టేయాలి. అప్పటివరకు కేసులో పిటిషనర్‌ అరెస్ట్‌ సహా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 23 , 2024 | 10:57 AM