Telangana: కొంచెం ఓపిక పట్టండి.. రేవంత్‌కు అసహనం ఎందుకో అర్థం కావడంలేదన్న కేటీఆర్..
ABN , Publish Date - Jul 24 , 2024 | 03:16 PM
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సీఎంగా ఉంటూ ఓపిక కోల్పోయి రన్నింగ్ కామెంటరీ అవసరమా అంటూ ప్రశ్నించారు. పేమెంట్ కోటాలో సీఎం పదవిని కొట్టేశారంటూ తాను విమర్శించవచ్చన్నారు. అయ్యల పేరు చెప్పి పదవులు తెల్చుకున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ఆయన రాజీవ్‌గాంధీని అంటున్నారా.. రాహుల్ గాంధీని అంటున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. వెంటనే శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుంటూ కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కామెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తే తాము తగిన జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?
ఇబ్బంది పడుతున్నారా..
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే చర్చను రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రారంభించలేదని.. ఆయన ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. శ్రీధర్‌బాబు తన ప్రసంగంలో చెప్పినదాంట్లో గత ఐదేళ్లు తాము అధికారపక్షంలో ఉండి చెప్పిందే తప్పితే కొత్తగా చెప్పిందేమి లేదన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్‌కు లేదన్నారు. రేవంత్ స్థాయికి తాము చాలని.. కేసీఆర్ అవసరం లేదన్నారు. సీఎం సత్తా తమకు తెలుసని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి తాము సరిపోతామని కేటీఆర్ తెలిపారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అవగాహన లేకుండా సభను నడుపుతున్నారన్నారు. తాము పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపామని.. ఎలా నడపాలో చెబుతామన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం రేవంత్‌కు లేకపోవడంతోనే ఆయన అవగాహన లోపంతో మాట్లాడుతున్నారన్నారు.
BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు
మద్దతు ఇస్తున్నాం..
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ జరుగుతున్న చర్చకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తమకు ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకోవల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజల పక్షాన తాము పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేసే వరకు ప్రజల తరపున పోరాడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమన్నారు. ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని అడుగుతామని.. కడుగుతామన్నారు. ఎవరు డ్రామాలు చేస్తున్నారో వారిని ఎండగడతామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8, కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని.. గణితంలో ఎనిమిది, ఎనిమిది కలిపితే పదహరు అవుతుందని.. కానీ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండుసున్నా అని తేలిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే పదం రాకపోవడానికి లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోవడమే కారణమన్నారు.
TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News