ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: భట్టి విక్రమార్కకు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:45 PM

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని భట్టి విక్రమార్కకు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌పై భట్టి విక్రమార్కకు అద్భుతమైన అవగాహన ఉందని..

MLA Prashant Reddy

హైదరాబాద్, ఆగష్టు 03: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్ల వర్షం కురిపించారు. కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పదవిని భట్టి విక్రమార్కకు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌పై భట్టి విక్రమార్కకు అద్భుతమైన అవగాహన ఉందని.. దానిని గుర్తించి ఆయనకే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రూ. 75 కోట్లతో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని డిప్యూటీ సీఎం భట్టి అంటున్నారని, ఇదే నిజమైతే ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే. ఇంత అనుభవం ఉన్న భట్టి విక్రమార్కకు ఖచ్చితంగా దేశ నీటిపారుదల రంగం బాధ్యతలు అప్పగించాల్సిందేనని సెటైరికల్ కామెంట్స్ వేశారు.


ఇవి బడ్జెట్ సమావేశాలే కావు..

నిన్నటి వరకు జరిగింది బడ్జెట్ సమావేశాలు కావని.. అవి బుల్డోజ్ చేసే వాటిలా ఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అన్నారు. జీరో అవర్ మొత్తానికే రద్దు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కేవలం ఆరు రోజులే సభ జరిపారన్నారు. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశంపై చర్చనే జరగలేదన్నారు. అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. అన్యాయంగా తాను మాట్లాడకుండా తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ రోజు ఏ ఒక్క విప్ కూడా ప్రతిపక్షాలతో మాట్లాడలేదన్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడుదాం అంటే మైక్ కట్ చేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మార్షల్స్‌ను పెట్టి తమను బయటికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఎం రేవంత్ భాషపై ఫైర్..

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, ఆయన తీరు హావభావాలు మొత్తం చూసి తనకు బాధేసిందన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ నడిచిన తీరు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడిన భాషపై అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. సబ్జెక్ట్ మంచిగా మాట్లాడుతున్నారని.. ప్రతిపక్షాలది పైచేయి అవుతుందని భయంతో తమను ఆపే ప్రయత్నం చేశారని, చర్చను మరుగున పడేశారన్నారు. ఈ సభ మొత్తం జరిగింది జరిగింది కేసీఆర్‌ను తిట్టడం, గత ప్రభుత్వాన్ని నిందించటం, తమను బెదిరించడంతోనే సరిపోయిందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. జాబ్ క్యాలండర్‌లో స్పష్టత లేదని.. రైతు భరోసా నిధుల మాటే లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత ఏది? అని ప్రశ్నించారు. రుణమాఫీ అంశంపై క్లారిటీ లేదని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వరు.. అడిగితే మార్షల్స్‌తో బయటకు ఎత్తి పడేస్తున్నారంటూ ప్రభుత్వం తీరుపై ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.


Also Read:

మహిళలకు ప్రభుత్వం కీలక ప్రకటన..!!

చంద్రబాబు మార్క్ అంటే ఇది..!!

బొత్సకు ప్రయారిటీ ఎందుకంటే..?

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 03 , 2024 | 08:45 PM

Advertising
Advertising
<