ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ప్రభుత్వ నిర్వాకంతో నగర ప్రజలకు తీవ్ర నష్టం

ABN, Publish Date - Aug 09 , 2024 | 03:17 PM

Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో హైదరాబాద్ నగర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు.

BRS Working President KTR

హైదరాబాద్, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వంపై (Telangana Govt) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో హైదరాబాద్ నగర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. నల్గొండ రైతులు సాగునీటి అవసరాలు తీరకుండా హైదరాబాద్ నగరానికి సుంకిశాల నీళ్లను ఎట్లా తీసుకువెళ్తారని ఆందోళన చేశారన్నారు. రైతులను ఒప్పించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 90 మిలియన్ గ్యాలన్ల నీళ్లను సుంకిశాల నుంచి నీళ్లను హైదరాబాద్ నగరానికి ఇచ్చారని గుర్తుచేశారు.

YS Sharmila: ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతం


వైఎస్ హయాంలో 108 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం ఇచ్చారన్నారు. కేసీఆర్ వచ్చాక కాళేశ్వరం, సీతారామ లాంటి ప్రాజెక్టులు కట్టి రైతుల్లో సాగునీటికి ఢోకా లేకుండా చేశారని తెలిపారు. కేసీఆర్ సుంకిశాల విషయంలో నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా హైదరాబాద్ నగరానికి త్రాగు నీళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. తాము సుంకిశాలకు వెళ్లి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చడానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. సుంకిశాల నుంచి మూడు పైప్ లైన్ల ద్వారా నీళ్లను ఎత్తిపోసి హైదరాబాద్ నగరానికి నీళ్లను తీసుకువచ్చామన్నారు.


అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు...

ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు, సుంకిశాల నుంచి క్రిష్ణా నీళ్లు,మల్లన్న సాగర్ నుంచి నీళ్లను హైదరాబాద్ నగరానికి తేవడమే లక్ష్యంగా కేసీఆర్ పని చేశారని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో నీటి కోసం యుద్ధాలను చూస్తున్నామని... కానీ హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితి రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు కేసీఆర్ హైదరాబాద్ నగరానికి నీళ్లను తేవడంలో కృషి చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సీతారామను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినట్లు భట్టి గొప్పలు చెప్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం దిగిపోయాక ప్రభుత్వం సుంకిశాలను పట్టించుకోలేదని... అయితే హైదరాబాద్ నగరంలో త్రాగునీటికి ఇబ్బందులు వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వానికి సుంకిశాల గుర్తుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పాలన పడకేసిందన్నారు. సుంకిశాల రిటైనింగ్ గోడ కూలిన రోజు ఆగస్టు 2న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చిందా? లేదా? అనేది స్పష్టం చేయాలని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి రాకపోతే అంతకంటే సిగ్గుచేటు లేదని విమర్శించారు. ప్రభుత్వానికి తెలిసినా వారం రోజులు దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడిగా ప్రభుత్వం గేట్లు అమర్చడం వలన ప్రమాదం జరిగిందన్నారు. కూలీలు షిఫ్ట్స్ మారే సమయంలో రిటైనింగ్వా ల్ కూలడంతో ప్రమాదం తప్పిందన్నారు.

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: వైఎస్ జగన్


పరిపాలనను గాలికి వదిలి...

సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను తన వద్ద పెట్టుకుని పాలన గాలికి వదిలేశారని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడిగడ్డలో ప్రమాదం జరిగితే.. ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి అధికారులు, ఏజెన్సీ వెంటనే స్పందించారని తెలిపారు. సుంకిశాల ప్రమాదం జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఏ ఏజెన్సీకి అయితే సుంకిశాల ప్రాజెక్టు అప్పగించిందో ఆ ఏజెన్సీని వెంటనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు తెలియకపోతే పరిపాలన మీద పట్టు ఉన్నట్లా...? అని నిలదీవారు. బిఆర్ఎస్ పార్టీపైన చిల్లర దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో చెడు జరిగితే బీఆర్ఎస్ ఖాతాలో వేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు.


బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అనాలా?

‘‘మేడిగడ్డలో ప్రమాదం జరిగితే వెంటనే ఎన్.డి.ఎస్.ఏ వస్తుంది. మరి సుంకిశాలకు ఎందుకు ఎన్.డి.ఎస్.ఏ రాద?. బీజేపీ,కాంగ్రెస్ ఒక్కటే అని తాము అనకూడదా...? సుంకిశాల ప్రమాదంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు...?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. త్రాగునీటి అవసరాల కోసమే సుంకిశాల ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. భట్టి విక్రమార్క ఆలోచనా విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. సుంకిశాల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసా అని అడిగారు. నిన్న హైదరాబాద్ నగరంలో మర్డర్ జరిగిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. మేడిగడ్డపై ప్రభుత్వం చేసింది దుష్ప్రచారమన్నారు. మేడిగడ్డ వద్ద పంపింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వచ్చేది కాళేశ్వరం నుండి కాదా అని అన్నారు. కేసీఆర్‌కు మంచి పేరు రావద్దని ప్రభుత్వం భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సోషల్ మీడియాలో వచ్చాక తమపైన ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన

KTR: కవిత జైలులో ఇబ్బంది పడుతోంది.. కేటీఆర్ ఆవేదన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 03:28 PM

Advertising
Advertising
<