ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చార్జ్‌షీట్‌

ABN, Publish Date - Jun 12 , 2024 | 05:42 AM

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని-- టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని-- టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ప్రైవేటు వ్యక్తి శ్రవణ్‌కుమార్‌ పేర్లను ప్రస్తావించారు. కుట్రకు బీజం పడిందెక్కడ? ఎలా అమలు చేశారు? అనే వివరాలతోపాటు.. నిందితుల వాంగ్మూలాల మేరకు రాజకీయ నాయకులు, పత్రికా ప్రముఖులు, ఓ న్యాయమూర్తి, ఇతరుల ఫోన్లను ఎలా ట్యాప్‌ చేశారు? అనే అంశాలను చార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. కాగా.. రిమాండ్‌లో ఉన్న భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. ఈ వ్యాజ్యంపై బుధవారం తీర్పు వెలువడనుంది. ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌పై పోలీసులు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 06:27 AM

Advertising
Advertising