TS News: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై కమిషనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN, Publish Date - Apr 13 , 2024 | 03:17 PM
Telangana: రైతుల బాగుకోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రైతులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గతనెల 25వ తేది నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించామని.. 7149 కేంద్రాల్లో కలిపి 1.87 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిజామాబాద్‌లో 1లక్ష ఎల్‌ఎంటీ, కామారెడ్డిలో 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కావాల్సిన యంత్రాలు సిద్ధం చేశామన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: రైతుల బాగుకోసం ప్రభుత్వం (Congress Government) ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ (Civil Supply Commissioner DS Chauhan) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రైతులు (Farmers) తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. గతనెల 25వ తేది నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించామని.. 7149 కేంద్రాల్లో కలిపి 1.87 ఎల్‌ఎంటీ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు అత్యధికంగా నిజామాబాద్‌లో 1లక్ష ఎల్‌ఎంటీ, కామారెడ్డిలో 11వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కావాల్సిన యంత్రాలు సిద్ధం చేశామన్నారు. 2350 నుంచి 2900 వరకు ధాన్యం కొనుగోలు క్వింటాలుకు ధర పెట్టి కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఎమ్‌ఎస్‌పీ కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో జరుగుతుందని తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఫీల్డ్ విసిట్ చేయబోతున్నామన్నారు.
Virat Kohli: ‘టీ20 వరల్డ్ కప్ జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదు’
ధాన్యం ఎండపెట్టకుండా పొలం నుంచి బ్యాగ్‌లోకి ఆర్వెస్టర్ ద్వారా కోపిస్తే కొంత రైతులు నష్టపోతున్నారన్నారు. జూన్ 30 వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం పూర్తిగా ఎండిన తర్వాత అమ్మితే ఎంఎస్‌పీ రేటు వస్తుందని.. రైతులు అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. బయట నుంచి రాష్ట్రానికి రాకుండా నిబంధనలు ఉన్నాయన్నారు. ఐరేసేస్ స్కాన్ వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు తరువాత రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు అందిస్తున్నామన్నారు. రైస్ మిల్లర్ల బకాయిలు మొదలు పెట్టామని... కొందరు మిల్లర్లు వసూళ్లకు భయపడి ఇతర దేశాలకు పారిపోయారన్నారు. మూడు నెలల్లో 6 వేల కోట్ల లోన్స్ తగ్గించామన్నారు. నిబంధనలు పాటించని మిల్లర్లపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మిల్లర్లు బియ్యాన్ని బయట రాష్ట్రానికి వెళ్లకుండా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు.
AP Politics: పురందేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన.. జగన్‌పై బీజేపీ నేత సీరియస్
మిల్లర్ల విషయంలోనే కాదు అధికారుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని అన్నారు. నాలుగు ఏళ్లుగా పెండింగ్‌లో రవాణా బకాయిలు రూ.900 కోట్లు క్లియర్ చేశామన్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తప్పించుకుని తిరిగే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు రైతులకు రూ.400 కోట్ల వరకు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ఐదేళ్లుగా కేంద్రం, రాష్ట్రం, ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన బకాయిలు ఫస్ట్ సిట్టింగ్‌లోనే వందల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. మార్కెట్ యార్డులలో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. జనగాంలో జరిగిన సమస్యపై చర్యలు చేపట్టామని... భవిషత్‌లో సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గతసారి కంటే 5 లక్షల ఎకరాలు పంట తగ్గిందని తెలిపారు. 60 పాడి, 40 రైస్ వస్తుందని డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP Politics: మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
AP Elections: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
Updated Date - Apr 13 , 2024 | 03:19 PM