Telangana: బిగ్ షాక్.. ‘రైతుబంధు’పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!
ABN , Publish Date - Jul 11 , 2024 | 12:21 PM
‘రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
హైదరాబాద్, జులై 11: ‘రైతుబంధు’ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయగా.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో నెల చివరి వారంలో జగరనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాలోచనలు చేయనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేయనున్నారు.
భూముల విషయంలో కీలక నిర్ణయం..
అంతేకాదు.. భూముల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు సహా తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందట. రేపో మాపో.. రైతుబంధు నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Also Read: