CM Revanth Reddy: గ్రూప్ వన్‌పై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN, Publish Date - Sep 30 , 2024 | 12:57 PM
పది నెలల్లోనే 11062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 30వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్: టెట్ తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. నిరుద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఉద్యోగాల భర్తీకి కృషి చేశారని అన్నారు. వారికి అభినందనలు తెలిపారు. 26ఆప్షన్ కింద డీఎస్సీ నిర్వహించామని వివరించారు.
ALSO READ: CPI Narayana: వన్ నేషన్ పేరిట హక్కులను కాలరాస్తున్న కేంద్రం
1:3ప్రాతిపాదికన ఫలితాల ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. దసరా లోపే 9అక్టోబర్ నాడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క నోటిఫికేషన్ వేసిందని మండిపడ్డారు.మాజీ సీఎం కేసీఆర్ కేవలం 7, 857 టీచర్లను మాత్రమే నియమించారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం
విద్య మీద పెట్టేది ఖర్చు కాదని తెలిపారు. పది నెలల్లోనే 11062 టీచర్ల భర్తీకి తాము కృషి చేశామని అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చిన అనతికాలంలోనే 30వేల ఉద్యోగ పత్రాలు అందజేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. గురుకులాల గురించి కేసీఆర్ చెప్పారని..కానీ మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.
ALSO READ: KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు
తమ ప్రభుత్వంలో యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వంద నియోజక వర్గాల్లో యంగ్ ఇండియా ఇంటి గ్రెటెడ్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ టీచర్ల పదోన్నతులు, బదిలీలు ఎందుకు చేయలేదని నిలదీశారు. దీని వల్ల టీచర్లలో నిరాశ ఏర్పడిందని చెప్పారు. 36వేల మంది టీచర్ల బదిలీలను ఎలాంటి విమర్శలు లేకుండా తాము పూర్తి చేశామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదని.. దాని వల్ల కొంత సమస్యలు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్
ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 30 , 2024 | 01:15 PM