CM Revanth Reddy: అరికేపూడి గాంధీ ఎపిసోడ్.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి మాస్ వార్నింగ్
ABN, Publish Date - Sep 15 , 2024 | 05:16 PM
తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 38నెలలు టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు తీసiకెళ్లానని తెలిపారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పూరించి వెనక్కి తిరిగి చూడలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఎపిపోడ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ALSO READ: CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం
మా జోలికి వస్తే తాటతీస్తాం..
‘‘కొంతమంది సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తాం అన్నారు. కానీ మనవాళ్లే వారి ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడు ఇప్పుడు మా మీద దాడి చేశారు అంటున్నాడు. మా మంచి తనం చేతగాని తనం అనుకోవద్దు. మా ప్రెసిడెంట్ సౌమ్యుడే కావొచ్చు..కానీ అతని వెనుక నేనున్నా. మా కార్యకర్తల జోలికి రావొద్దు. కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం తాటతీస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
మహేశ్ కుమార్ గౌడ్ పాత్ర కీలకం
ఈరోజు(ఆదివారం) టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మహేష్ కుమార్ గౌడ్ తనదైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి హరీష్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ:Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
రైతులు ఆందోళన చెందొద్దు...
‘‘దూలం లెక్క పెరిగిన ఓ సన్నాసి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని నాకు సవాల్ విసిరాడు. ఇచ్చిన మాట ప్రకారం 23లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేశాం. రాజీనామా చేస్తా అన్నా.. ఆ సన్నాసి ఎక్కడ దాకున్నాడు. రూ. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చి ఆదుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90రోజుల్లో 30వేల ఉద్యోగాలు కల్పిచాం. 35వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి ఏడాదిలో 65 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు. ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. రూ. 140కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలంపిక్స్‌లో ఒక్క పతకం రాకపోవడం అవమానకరం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి..
.‘‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నాం. త్వరలో రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు జోడెద్దుల్లా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ పార్టీకి అసలైన ఫైనల్స్ 2029లో ఉన్నాయి. దేశంలో గెలిచి రాహుల్ గాంధీను ప్రధాని చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ అసలైన ఫైనల్ గెలిచినట్లు. 2029లో తెలంగాణ నుంచి 15మంది ఎంపీలను గెలిపించే వరకు ఎవరు విశ్రమించొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం
కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లా..
తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 38నెలలు టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పూరించి వెనక్కి తిరిగి చూడలేదని అన్నారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని స్పష్టం చేశారు. రూ.10లక్షల ఆరోగ్య శ్రీ ఇచ్చి తమది పేదల ప్రభుత్వమని నిరూపించామని అన్నారు. 23లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18వేల కోట్లు వేశామని గుర్తుచేశారు. తాను, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశామని తెలిపారు. ప్రజలు తమ హామీలను విశ్వసించి అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..
TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..
For More Telangana News and Telugu News.
Updated Date - Sep 15 , 2024 | 05:48 PM