ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక సూచనలు

ABN, Publish Date - Feb 11 , 2024 | 06:28 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు(సోమవారం) అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. ఈనెల13వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌ను రేవంత్, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనపై సీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Updated Date - Feb 11 , 2024 | 06:34 PM

Advertising
Advertising