Mallu Ravi: నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌పై మల్లు రవి క్లారిటీ
ABN, Publish Date - Mar 04 , 2024 | 01:37 PM
Telangana: నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు.
హైదరాబాద్, మార్చి 4: నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీపై మాజీ ఎంపీ మల్లు రవి (Former MP Mallu Ravi) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ నుంచి పోటీలో మల్లు రవి ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టంగా చెప్పారన్నారు. ‘‘టికెట్ నాకే ఇస్తానని సీఎం స్పష్టంగా చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ నాకే ఇస్తారని నమ్మకంగా ఉన్నాను. సర్వేలన్నింటిలో నేనే ముందున్నాను’’ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ - బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందూ మత మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. బీజేపీ హిందూ మతానికి వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అవగాహనతో పని చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో పాలాభిషేకాలు లేవన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతామనే పారిపోతున్నారని మల్లు రవిం ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి
Lokesh: ఓటమి తేలిపోవడంతో ముసుగు తీసేసి జగన్ దుర్మార్గపు చర్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 04 , 2024 | 01:40 PM