ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: దసరా పండగకి ఊరెళ్తున్నారా.. సైబరాబాద్ పోలీసులు హెచ్చరిక..

ABN, Publish Date - Sep 30 , 2024 | 06:17 PM

దసరా పండగకు ఊరు వెళ్లే వారు విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలని చెప్పారు. పంగడ వేళ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.

హైదరాబాద్: దసరా పండగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేవారికి సైబరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పండగ వేళ ఊరెళ్తే తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్లిపోతే సొమ్మును జాగ్రత్త చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ రోజుల కంటే ఇలాంటి సందర్భాల్లో అధికంగా దొంగతనాలు జరుగుతాయని తెలిపారు. దొంగలు నిఘా పెట్టి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్తారని హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని చెప్పారు. లేదంటే తిరిగి వచ్చే లోపు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని, విలువైన వస్తువులు ఉంటాయో లేదో గ్యారెంటీ ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పలు కీలక సూచనలు చేశారు.


ముఖ్య సూచనలు..

"దసరా పండగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి. సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళాలు అమర్చుకోవడం ఉత్తమం. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే డయల్ 100కు ఫోన్ చేయాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయడం మర్చిపోవద్దు. వీలైతే చక్రాలను ఇనుప గొలుసుతో లాక్ వేయడం మంచిది.


నమ్మకమైన వాచ్‌మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి. ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్తా చెదారం, వార్తా పత్రికలు, పాలప్యాకెట్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఉంటే మీరు ఇంట్లో లేరనే సమాచారం దొంగలకు తెలిసిపోతుంది. వాటినీ గమనించి దుండగులు దోపిడీకి పాల్పడుతుంటారు. మెయిన్ డోర్‌కి తాళం కప్ప వేసినప్పటికీ అది కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్ చేయాలి. బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంటే మంచిది. అలా చేస్తే ఇంట్లో మనుషులు ఉన్నారనుకుని దొంగలు రాకుండా ఉంటారు. ఇంటి చుట్టుపక్కల నమ్మకమైన ఇరుగు పొరుగు వారిని మీ ఇంటి గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది.


మీ ఇంటికి వచ్చే, వెళ్లేదారులు, ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలి. అల్మరా, కబోర్డ్స్‌కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియాలైన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల కింద, అల్మరాపైన, డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉంచకుండా సీక్రెట్ ఏరియాలో దాయాలి. బంగారు ఆభరణాలు వేసుకుని ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు జాగ్రతలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఇంట్లో లేరన్న విషయం తెలిసిపోయి దొంగలు పడే అవకాశం ఉంటుంది. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలు నిర్వహించుకోవాలి. ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444కు ఫోన్ చేయండి" అని పోలీసులు సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఆ విషయంలో వెనక్కి తగ్గని యాజమాన్యం..

KTR: ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Konda Surekha: మంత్రి కొండా సురేఖ కంటతడి.. కేటీఆర్‌కు తీవ్ర హెచ్చరిక

Updated Date - Sep 30 , 2024 | 07:59 PM