ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dasoju Sravan: రేవంత్ జైలుకెళ్లడం ఖాయం.. దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 01:54 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బుద్ధి,జ్ఞానం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఇరవైఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఎన్నడైనా ఫ్లోరైడ్ బాధితులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. జలసాధన సమితి ధర్నాలో కోమటిరెడ్డి ఎప్పుడైనా పాల్గొన్నారా అని నిలదీశారు.

హైదరాబాద్: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి జీవన విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో దాసోజు శ్రవణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ 40 ఏళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారని ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పాచి కల్లు తాగిన వారి లెక్క మాట్లాడారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.


పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని తెలిపారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మాదిరి గల్లీ రౌడీలు కూడా మాట్లాడరని చెప్పారు. కేసీఆర్ వయసుకు గౌరవం ఇవ్వకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ బర్త్ డే విషెస్ చెప్పలేదని బాధతో మాట్లాడినట్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. సీఎం పదవి పోతుందని ఫ్రస్టేషన్‌లో రేవంత్ రెడ్డి ఉన్నారని దెప్పిపొడిచారు. మూసీ అభివృద్ధి చేయొద్దని కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడైనా వద్దన్నారా అని నిలదీశారు. మూసీ ప్రాజెక్టును అదానీ, మెగా కృష్ణారెడ్డికి అప్పగించే కుట్ర చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.


రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏమైనా గంజాయి తాగి మాట్లాడుతున్నారా అని విమర్శించారు. మూసీ అభివృద్ధికి డీపీఆర్ అడిగితే తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడానికే రేవంత్ రెడ్డి పాదయాత్ర పెట్టుకున్నారని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆంధ్రాకు అనుకూలంగా ఉన్నారని విమర్శలు చేశారు. కొరియాలో చింగే చాంగ్ నది విషయంలో అక్కడి ప్రధాని జైలుకు వెళ్లారని అన్నారు. మూసీ నది విషయంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు పెట్టి జైల్లో పెట్టాలని దాసోజు శ్రవణ్ అన్నారు.


కోమటిరెడ్డికి బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డారు. ఇరవైఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి ఎన్నడైనా ఫ్లోరైడ్ బాధితులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. జలసాధన సమితి ధర్నాలో కోమటిరెడ్డి ఎప్పుడైనా పాల్గొన్నారా...? అని నిలదీశారు. కోమటిరెడ్డి తెలంగాణ కోసం దొంగ దీక్ష చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సంకర జాతి భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భాష ఇది కాదని.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ఇలాగే మాట్లాడితే తాము చూస్తు ఊరుకోమని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు

Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 02:08 PM