ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Scam: మళ్లీ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఎందుకంటే..

ABN, Publish Date - Apr 15 , 2024 | 01:50 PM

MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు..

Delhi Liquor Scam

MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కవితను అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మూడు రోజులు లిక్కర్ స్కామ్‌పై కవితను విచారించారు సీబీఐ అధికారులు.

మరో 9 రోజులు జ్యూడీషియల్ కస్టడీ..

సీబీఐకి ఇచ్చిన మూడు రోజుల కస్టడీ నేటితో ముగియగా.. సీబీఐ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. అయితే, వాదనలు విన్న ధర్మాసనం.. కవితను మరో 9 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే.. కవిత తరఫు న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 01:50 PM

Advertising
Advertising