ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deshapathi Srinivas: రేవంత్ సర్కార్ తెలంగాణ స్వాభిమానం పై దాడి చేస్తోంది

ABN, Publish Date - Aug 15 , 2024 | 11:48 AM

రేవంత్ సర్కార్ తెలంగాణ స్వాభిమానంపై దాడి చేస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణపై సోయి లేదని ఆక్షేపించారు. వలసవాద మానస పుత్రుడు రేవంత్ అని సంచలన ఆరోపణలు చేశారు.

Deshapathi Srinivas

హైదరాబాద్: రేవంత్ సర్కార్ తెలంగాణ స్వాభిమానంపై దాడి చేస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణపై సోయి లేదని ఆక్షేపించారు. వలసవాద మానస పుత్రుడు రేవంత్ అని సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో జై తెలంగాణ నినాదం మసకబారిందని ఆరోపణలు చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కోసం గత ప్రభుత్వం కేటాయించిందని.. కానీ రేవంత్ ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే న్యాయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తన ప్రభావం చూపడానికి, దివంగత నేత రాజీవ్ విగ్రహం పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా లేక రాజీవ్ విగ్రహం ఉండాలా అని ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వ చిహ్నన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. కానీ రాజీవ్ విగ్రహం పెట్టడం సంకుచిత మనస్తత్వమని విమర్శించారు


. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయడం విచారకరమని అన్నారు. కావాలంటే రాజీవ్ విగ్రహాన్ని మరోచోట పెట్టండి. అభ్యంతరం లేదని చెప్పారు. తెలంగాణకు, రాజీవ్ గాంధీకి ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేయొద్దని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 11:55 AM

Advertising
Advertising
<