Harish Rao: రాహుల్.. అశోక నగరానికి వెళ్లండి
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:08 AM
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను కలవాలని.. ఆ యువత పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో చూడాలంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్టు చేశారు.
హైదరాబాద్, నవంబర్ 5: ఇటీవల గ్రూప్-1 విద్యార్థుల ఆందోళనలతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో తీవ్ర హైటెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పాటు అరెస్ట్‌లు చేశారు. పలు చోట్ల లాఠీచార్జ్‌లు కూడా జరిగాయి. నిరుద్యోగుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
AP News: కలెక్టర్ కాళ్లయినా పట్టుకుంటా.. జేసీ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను కలవాలని.. ఆ యువత పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో చూడాలంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్టు చేశారు.
హరీష్‌రావు పోస్టు ఇదే..
‘‘అశోక నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ.. మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజా పాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా. హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ను సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి.. వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన మీ ప్రభుత్వ తీరును చూడండి. మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు, ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్‌గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు, కానీ అది కేవలం జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. పది నెలల కాలంలో నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు మీ పార్టీ చూపిన కపట ప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది’’ అంటూ ఎక్స్‌లో హరీష్‌రావు పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News