Share News

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:15 AM

Telangana: ఫార్ములా ఈరేస్‌పై అసెంబ్లీలో చర్చకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టారు. ఈరేసుపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు.

Jagadishreddy: ఈరేసుపై చర్చ పెట్టండి.. లేదంటే
Former Minister Jagadish Reddy

హైదరాబాద్, డిసెంబర్ 20: ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Former minister Jagadish Reddy) స్పందించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని.. లేకుంటే అసెంబ్లీని జరగనివ్వమని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఈరేసుపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ (BRS Working President KTR) సిద్ధంగా ఉన్నారన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ నేతగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ


అన్ని పార్టీలకు సభాపతిగా వ్యవహరించాలని కోరారు. అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ఫార్ములా రేసింగ్‌లో అవినీతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటిగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. బడే బాయ్ చేటే బాయ్.. ఒకటే లైన్‌లో ఉన్నారని అన్నారు. కేటీఆర్ కేసు వ్యవహారంలో బీజేపీకి ఏం పని అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


కాగా... ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్‌ కుమార్, ఏ3గా ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది. 2023, ఫిబ్రవరి 11న గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్ములా ఈరేస్‌లో ఎన్నో అవకతవకు జరిగాయని కాంగ్రెస్ సర్కార్ గుర్తించారు. దీనిపై విచారణకు సర్కార్ ఆదేశించింది. దాదాపు రూ.55 కోట్ల వరకు నిధుల విషయంలో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ కంపెనీకి కట్టబెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించారు.

నవ్వులపాలైన వరుడు.. వధువు డాన్స్ చేస్తుండగా..


ఈ క్రమంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం కోసం ముందుగా రాష్ట్ర గవర్నర్‌ అనుమతి కోసం ప్రభుత్వం పంపగా.. అందుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డును క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ నిన్న (గురువారం) కేటీఆర్‌తో సహా మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రెండు మూడు రోజుల్లో వీరికి నోటీసులు పంపించి విచారణకు పిలిచే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

Lagacharla Case: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..

కేటీఆర్‌ ఎపిసోడ్‌: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ


Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 20 , 2024 | 10:56 AM