ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TTDP: టీటీడీపీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి..!?

ABN, Publish Date - Jun 10 , 2024 | 07:10 PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో గత రెండు రోజులుగా మల్లారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

Mallareddy,

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరులతో గత రెండు రోజులుగా మల్లారెడ్డి సమావేశం నిర్వహించినట్లు విశ్వాసనీయ సమాచారం. తిరిగి సొంతగూటికి చేరే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు సమాచారం. 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగానూ పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు.


మల్లారెడ్డి సంస్థల చైర్మన్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీకి జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది.టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో ఉన్న పరిచయాలతో ఆయన టీటీడీపీలోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 07:51 PM

Advertising
Advertising