ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GHMC Commissioner: టాక్స్ వసూళ్లలో సమస్యలున్నాయి.. పరిష్కారం వెతుకుతున్నాం..

ABN, Publish Date - Feb 20 , 2024 | 02:40 PM

Telangana: ప్రాపర్టీ టాక్స్ అనేది చాలా ముఖ్యమైన అంశమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రాపర్టీ టాక్స్ అనేది జీహెచ్‌ఎంసీకి మేజర్ ఆదాయ మార్గమని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రాపర్టీ టాక్స్ అనేది చాలా ముఖ్యమైన అంశమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ (GHMC Commissioner Ronald Ross) అన్నారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో (GHMC Council Meeting) కమిషనర్ మాట్లాడుతూ.. ప్రాపర్టీ టాక్స్ అనేది జీహెచ్‌ఎంసీకి మేజర్ ఆదాయ మార్గమని చెప్పుకొచ్చారు. టాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని... సమీక్షల్లో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ ఆదాయ మార్గాల వేటలో ఆయా పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేర్చుతున్నారని తెలిపారు. రెసిడెంట్స్ నాన్ రెసిడెంట్స్‌పై టాక్స్ వేరు వేరు రేట్లు ఉన్నాయన్నారు. రేట్ల మార్పుపై 2017లో ఒకసారి 2019లో జీవోలు విడుదల అయ్యాయన్నారు. డిగ్నిటీ హౌసెస్‌కు డోర్ నంబర్స్ వేసేందుకు యాక్షన్ మొదలయిందన్నారు.

ఓయో హాస్టల్‌పై విచారణ చేసి టాక్స్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెల్ఫ్ అసిస్మెంట్‌పై త్వరలోనే పూర్తి ప్రకటన చేస్తామన్నారు. జీఐఎస్ (GIS) మ్యాప్‌ను జీహెచ్‌ఎంసీ త్వరలోనే మళ్ళీ గ్రౌండ్ చేస్తామన్నారు. టాక్స్ వసూళ్లలో చట్టం ప్రకారం వెళ్తున్నామని - నిబంధనలు అతిక్రమిస్తే పెనాల్టీ వేస్తామని స్పష్టం చేశారు. సిటిలో సెల్లార్‌‌లలో పార్కింగ్‌పై పోలీస్ - జీహెచ్‌ఎంసీ జాయింట్ సర్వే చేస్తామని వెల్లడించారు. పార్కింగ్ కోసం ఉన్న సెల్లార్‌లను ఇతర వాటి కోసం వాడితే కఠినమైన చర్యలు ఉంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ హెచ్చరించారు.

అంతకుముందు ప్రాపర్టీ టాక్స్‌పై చర్చ

కాగా... ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తెలిపారు. సెల్ఫ్ అసెస్మెంట్‌పై అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రాపర్టీ టాక్స్‌పై చాలా ఆదాయం తగ్గుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెసిడెన్షియల్‌ను కమర్షియల్‌గా మారుస్తున్నప్పటికీ టాక్స్ కలెక్ట్ చెయ్యకపోవడంతో జీహెచ్‌ఎంసీ ఆదాయం కోల్పోతుందని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వెల్లడించారు.

బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. టాక్స్ వసూలు చేస్తున్నాము కానీ ఎంత వరకు వారికి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని ప్రశ్నించారు. జనానికి కనీసం పార్కింగ్ సదుపాయం కల్పించడం లేదన్నారు. హైటెక్ సిటీ, సరూర్‌నగర్‌లో ఒకే లాగా టాక్స్ వసూలు ఎట్లా చేస్తున్నారని నిలదీశారు. టాక్స్‌పై అధికారుల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. టాక్స్ కలెక్షన్ విభాగంపై క్రెడెబిలిటీ లేదన్నారు. తీసుకునే పర్మిషన్ ఒక్కటి.. అక్కడ నడిపించేది ఒక్కటి అంటూ బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2024 | 02:54 PM

Advertising
Advertising